'అంతము లేని ఈ భువనమంత పురాతన పాంథశాల' అన్న పద్య పాదం విన్నా, "సంచారమే ఎంతో బాగున్నది... దీనంత ఆనందమేమున్నది... ఇల్లు పొల్లూలేని, ముల్లె మూటా లేని....వెంబడించే వెర్రి జ్ఞాపకాలూ లేని ...సంచారమే ఎంతో బాగున్నది.. '' అంటూ గానం చేసిన ఒక జానపద కవి తత్వం విన్నా వెంటనే గుర్తుకొచ్చేది లోకసంచారి రాహుల్ సాంకృత్యాయన్. ఆయన రాసిన 'లోకసంచారి' ('ఘుమక్కడ్ శాస్త్ర)
పుస్తకం లోక సంచార జీవన తత్వానికే ఒక ప్రామాణిక గ్రంధమయ్యింది. ఆ పుస్తకం దాదాపు ఆయన జీవితానికే ఒక నిలువుటద్దమై నిలిచింది.
జ్ఞాన సముపార్జనే జీవిత లక్ష్యం అయితే దానికి లోక సంచారిగా మారడమే శ్రేష్ఠం అన్నది రాహుల్ సాంకృత్యాయన్ స్థిరమైన అభిప్రాయం. ఈ విషయాన్నే చెబుతూ " ఆది మానవుడు నిఖార్సయిన లోక సంచారి. ఆకాశంలో పక్షులు విహరించేంత స్వేచ్ఛగా అతడు లోకంలో విహరిస్తూ ఉండేవాడు. ఇల్లూ, వాకిలీ, పొలము-పుట్రా ఈ బంధనాలేవీ ఉండేవి కావు అతడికి. ఈ రోజు ఇక్కడ ఉండే రేపు మరోచోట. ఆధునిక మానవుడు బావిలో కప్పలా మారిపోయాడు. గానుగెద్దులా జీవితమంతా ఒకేచోట పడి ఉంటున్నాడు. ఈ స్థిరజీవులు, ఈ గానుగెద్దులే ప్రపంచాన్ని ఉద్ధరించారనే భ్రమలో కొందరు ఉన్నారు. కానీ, జీవోత్పత్తి , పరిణామ శాస్త్రాల మీద అపారమైన పరిశోధనలు చేసిన డార్విన్ ఆ జన్మ లోక సంచారి అని ఎందరికి తెలుసు? అతడు అలా లోకసంచారి కాకపోతే ఆ పరిశోధనలు చేయగలిగే వాడా? అంటూ ఆయన ప్రశ్నిస్తాడు.
పుస్తకాలు నీడలు
"మానవుడు స్వయంగా లోక సంచారి కావలసిన పనిలేదు. గ్రంధాల ఆధారంగా ప్రాపంచిక జ్ఙానాన్ని పొందవచ్చు'' అంటారు, కొందరు. నిజానికి యాత్రా సాహిత్యం చదవడం వల్ల కలిగే జ్ఞానం చాలా స్వల్పమే. పుస్తకాలు నీడల్లాంటివి. హిమాలయ పర్వతాల ఫోటోలు చూసి ఎవరైనా హిమాలయాల సౌందర్యాన్నీ, చల్లదనాన్నీ అనుభూతి చెందగలరా? అంత మాత్రాన యాత్రాసాహిత్యం పూర్తిగా వ్యర్థం అని నేనను. అసలే లేకపోవడం కన్నా పుస్తకాల ద్వారా ఏదో కొంత పొందడం మేలే.
అయితే లోకసంచారులు రాసిన సాహిత్యం చదవడం వల్ల తనూ లోక సంచారి కావాలన్న ప్రేరణ అయినా పొందుతారనుకోవచ్చు'' అంటాడాయన. సంచార జీవనంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా మొత్తంగా చూస్తే లోకసంచారి జీవితం షడ్ర సోపేతంగా ఉంటుందంటాడు రాహుల్. యాత్రలు కఠినంగానే ఉన్నా, అపరిచిత దేశాల్ని చూడటంలోనూ లోకసంచారికి ఒక గొప్ప ఆనందం కలుగుతూ ఉంటుంది. ఆధునిక ప్రపంచానికి దూరంగా, అపరిచిత ప్రదేశాల్లో ప్రత్యేకించి వెనుకబడిన సమూహాల్లోకి వెళ్లి వాళ్లతో ఉండి, వారి సుఖదుఃఖాల్నీ తెలుసుకుని లోకసంచారి సభ్య ప్రపంచానికి తెలియచేస్తారు.'' అంటాడు రాహుల్. ఆయన ప్రసిద్ధ రచన 'ఓల్గా నుంచి గంగ' లో ఒక చోట తాను సంచరించిన ఒక ప్రదేశాన్ని గురించి చెప్పిస్తాడు ఓ పాత్రతో.
"గ్రామాల్లో దారిద్య్రం ఉంది. కానీ, హృదయ విదారకమైన దృశ్యాలు అక్కడ తక్కువే కనపడతాయి. అక్కడ దాసదాసీ జనాల్ని అమ్మేసేటంత కనపడదు. వివస్త్రగా ఉన్న వారిని కొరడాలతో కొట్టే దృశ్యాలు కనపడవు. కాళిదాసు ఒక సందర్భంలో ఈ విషయమై మాట్లాడుతూ తమ పూర్వజన్మలో చేసిన కర్మఫలాలను అనుసరించే కొందరు దాసదాసీలుగా పుడతారు అంటాడు. ఏ రోజైతే నేనామాట ఆయన నోట విన్నానో ఆ రోజునుంచే నాకు పూర్వ జన్మ అంటే నమ్మకం లేకుండా పోయింది.'' అంటుంది. సాహిత్యం మాటున సాంకృత్యాయన్ ఇలా తన ఆగ్రహాన్ని, ఆక్రోశాన్నీ బయటపెడతాడు.
బుద్ధుడు లోకసంచారి
ప్రపంచంలోని మతాచార్యులందరూ లోకసంచారులే! మతాచార్యులందరిలోకి బుద్ధుడు సర్వశ్రేష్ఠుడు. బుద్ధికుశలతలోనూ, సహృదయతలోనూ బుద్ధుడే సర్వోన్నతుడు అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి మత ప్రవక్త ఆ జన్మ సంచారి. బుద్ధుడు ఇతర దేశాలకు వెళ్లలేదు కానీ, భారత దేశంలోనే నిరంతరం పర్యటించే వాడు. పైగా "బిక్షువుల్లారా పర్యటించండి'' అంటూ తన శిష్యులకు నిరంతరం చెప్పేవాడు.
భారతీయ మతాల్లో ఒకటైన జైన మత ప్రవక్త మహా వీరుడు. ఇతడూ ఆ జన్మ సంచారే. బుద్ధుడు, మహా వీరుడు మహాత్ములు కావడానికి లోక సంచారులు కావలసి వచ్చింది. ఒక చోట స్థిరంగా ఉంటూ ఓ పదేళ్లలో సంపాదించే జ్ఞాన విజ్ఞానాలను సంచారిగా ఉంటూ కేవలం రెండేళ్లలో సంపాదించవచ్చు. మానవుడు అనుసరించడానికి, ఆదరించడానికి లోక సంచారతత్వానికి మించిన మతం లేదు. ఏ జాతి అయినా అభివృద్ధికి రావడం అన్నది ఆ జాతిలోని లోక సంచారుల మీదే ఆధారపడి ఉంటుంది.'' అంటాడు సాంకృత్యాయన్.
జీవితం ఓ ప్రయాణం
రాహుల్ సాంకృత్యాయన్ రాహుల్ ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌గర్ జిల్లాలో ఏప్రిల్ 9, 1893న జన్మించాడు. ఆయన అసలు పేరు కేదార్ పాండే. బౌద్ధం మతంతో ప్రభావితమైన తరువాత తన పేరును రాహుల్ సాంకృత్యాయన్‌గా మార్చుకున్నాడు. తన జీవిత కాలంలో సుమారు 45 ఏళ్ల పాటు ఆయన లోక సంచారంలోనే గడిపాడు. అద్వైత వాదం నుంచి మార్క్సిజం దాకా ఆన్ని తత్వాల మీదా గొప్ప సాధికారతను సాధించాడు. ఒక దశలో బౌద్ధ బిక్షువుగా మారిన సాంకృత్యాయన్ బుద్ధుడి పట్ల ఆపారమైన ఆరాధనతో ఉన్నాడు. స్వాతంత్య్ర సమర కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన రచనలు, ఉపన్యాసాల కారణంగా మూడేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు.
ఆయనకున్న అపారమైన పాండిత్యానికి అతనికి మహాపండిత్ అన్న బిరుదును ప్రదానం చేశారు. 9వ ఏట రాహుల్ ప్రపంచాన్ని చూడాలన్న కాంక్షతో ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. పాఠశాలలో ప్రాధమిక విద్య మాత్రమే అభ్యసించాడు. కానీ, ఆ తరువాత స్వయం కృషితో సుమారు 30 భాషల్లో పాండిత్యాన్ని సాధించాడు. లెనింగ్రాడ్ యూనివర్సిటీలో కొంత కాలం ఇండాలజీ ప్రొఫెసర్‌గా కూడా పనిచేశాడు. ఆయన రాసిన ఓల్గా నుంచి గంగకు , లోకసంచారి, విస్మృత యాత్రికుడు, ప్రాక్పశ్చిమ దర్శనాలు వంటి రచనలు ఆయనకు ఆపారమైన పేరు పఖ్యాతులు తెచ్చిపెట్టాయి. లోకసంచారిగా ఆయన శ్రీలంక, జపాన్ కొరియా, చైనా, రష్యా వంటి పలు దేశాలకు కాలినడకన వెళ్లాడు.
జీవితాన్ని జీవించాలి
లోక సంచారికి వివాహం ఒక పెద్ద అడ్డుగోడ అని నమ్మే సాంకృత్యాయన్ ఒక చిన్న సడలింపు కూడా చెబుతాడు. తన సంచారానికి భంగం కలగకుండా ఉంటే స్త్రీలోక సంచారిని జీవన సహచరిగా స్వీకరించవచ్చునంటాడు. అందుకేనేమో బాగా చిన్న వయసులోనే అతడు పెళ్లయ్యింది. ఆ బంధమేమీ కొనసాగలేదు. సోవియట్ రష్యాలో ఉంటున్న కాలంలో మంగోలియన్ స్కాలర్‌తో తన అనుబం«ధాన్ని కొనసాగించాడు. రష్యా నుంచి ఇండియాకు వ చ్చేశాక ఇండియన్ నేపాలీని పెళ్లి చేసుకున్నాడు.
ఆ తరువాత శ్రీలంక యూనివర్సిటీకి ప్రొఫెసర్‌గా వెళ్లిన రాహుల్ కొన్నాళ్లలోనే తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. చివరికి డార్జిలింగ్‌లో ఏప్రిల్ 14,1963న తన తుది శ్వాస విడిచాడు. ఒక మనిషి తన జీవిత కాలంలో ఏమేం చేయగలడు? అన్న ప్రశ్నకు చేవ ఉన్నవాడు లోకాన్ని సమగ్రంగా అధ్యయనం చేయగలవాడు ఎన్నయినా చేయగలడు అన్న సమాధానం రాహుల్ సాంకృత్యాయన్ జీవితాన్ని చూస్తే బోధపడుతుంది.

No comments:
Post a Comment