Monday, April 25, 2011

గుడాఫీ * లిబియన్ నియంత కల్నల్ మొ అమ్మర్ గడాఫీ - ఒక తెలుగు వైద్యుడి స్వీయానుభవాలు

నియంత అంటే అంతా బ్యాడే కనిపిస్తుంది. కానీ గడాఫీని దగ్గరగా చూసిన వారికి అతడిలో బ్యాడ్ మాత్రమే కాదు, గుడ్ కూడా కనిపిస్తుంది. అందుకే అతడిని గుడాఫీ అని కూడా అనవచ్చేమో!

మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫారిన్ అసెస్‌మెంట్ వింగ్ ద్వారా లిబియాకు వెళ్లిన డాక్టర్స్ డెలిగేషన్‌లో ఇ.ఎన్.టి. స్పెషలిస్టుగా 1985 నుంచి పద్నాలుగేళ్లు, ప్రస్తుతం గడాఫీకి ఎదురు తిరిగి తిరుగుబాటు చేస్తున్న ప్రదేశాలలో ఒకటైన అల్‌మర్ నగరంలోని గవర్నమెంట్ హాస్పిటల్‌లో కొన్నాళ్లు పని చేశాను. నేను గొంతులో కాయల్తీసినవాళ్లు, చెవిలో కన్నాలు సరిచేయించుకున్న వ్యక్తులే కాక, ఎంతోమంది పరిచయస్తులు - నా లిబియన్ స్నేహితులు, ఇవ్వాళ రోడ్ల మీదకు వచ్చి తిరుగుబాటు చేస్తూ టీవీలో కనిపిస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నా జీవితంలో ‘పీక్ పీరియడ్’ని ఆ దేశ ప్రజల సేవలో గడిపాను.http://quartetbooks.files.wordpress.com/2011/02/gaddafi_dw_politik__545028g.jpg
పద్నాలుగేళ్లంటే మాటలు కాదు, నన్ను హాఫ్ లిబియన్ అనొచ్చు. 1986 లో రెండు అమెరికన్ స్టెల్త్ బాంబర్లు అతి తక్కువ ఎత్తులో ఓ తెల్లవారుజామున మా ఇంటి మీది నుంచే ట్రిపోలీ వైపు వెళ్తుంటే, ఆ స్పీడ్‌కి మా ఇంటి కిటికీలు ఊగిపోవడం చూసిన ప్రత్యక్ష సాక్షిని. గడాఫీ ఏ రాత్రీ పడుకున్న చోట పడుకోడు. అతని ఇంటి మీద బాంబు వేసి వెళ్లిన అమెరికన్స్‌కది ‘ఫెయిల్యూర్ మిషన్’. గడాఫీకి ఏడుగురు డూప్‌లు ఉండేవాళ్లని పుకారు. ఆ నిజానిజాలు డూపులకే తెలియాలి. అరబిక్ భాష నాకు కొట్టిన పిండి కావడంతో ఆ ప్రజలకి తల్లో నాలుకనయ్యాను. రెండుసార్లు నేను గడాఫీని దగ్గర్నుంచి చూశాను. ఆయన స్పీచ్‌లు విన్నాను. ప్రొటోకాల్ ప్రకారంగా, ఆయన మా ఊరు వచ్చినప్పుడు అది నా డ్యూటీ కూడా. http://indepthafrica.com/wp-content/uploads/2011/03/Moammar-Gaddafi.jpg
నేను లిబియా వెళ్లిన కొత్తలో మా సీనియర్ ఇండియన్ డాక్టర్స్ నాక్కొంత హితబోధ చేశారు. ‘‘ఇది లిబియా అనబడు దేశము. ఇచ్చట ఫారినర్సందరూ ఫస్ట్‌క్లాస్ సిటిజన్స్. ఆ తర్వాతే లిబియన్స్. దానిక్కారణం వీళ్లకు సడెన్‌గా వచ్చిన గర్వాన్ని తొక్కిపెట్టే అధినేత. గాడిదల మీంచి తిన్నగా టయోటా కార్లలోకి దూకడంతో వచ్చిన తంటా ఇది. ఇది ముస్లిం కంట్రీ అయినా సర్వమత సామరస్యం ఉంది. ఆల్కహాల్ నిషిద్ధమే అయినా ఇంటి బాత్రూమ్‌లో బ్రువరీస్ పెట్టుకోవచ్చు. కావలిస్తే దానిక్కావలసిన ద్రాక్ష పళ్లన్నీ వీళ్లే మీ ఇంటికి ఫ్రీగా తెచ్చిస్తారు. ఇంత స్వాతంత్రం నీకు మరేదేశంలోనూ దొరకదు. కానీ ఒక ముఖ్యమైన వార్నింగ్. నీ వొకాబులరీలోంచి ‘గ’ అనే అక్షరంతో మొదలయ్యే ఏ భాషలోని ఏ పదాన్నైనా అర్జెంటుగా తొలగించెయ్. కల్లో కాదు, మనసులో కూడా అనుకోకు. ప్రామిస్ చెయ్’’ అన్నారు.
‘‘అమ్మ లిబియాయోయ్!’’ అనుకున్నాను.
http://www.breakingperceptions.com/wp-content/uploads/2010/04/muammar_al-gaddafi.jpg
* * *
సెప్టెంబర్ ఫస్ట్ ఆ దేశానికి ‘రివ ల్యూషనరీ డే’. మన ఆగస్టు పదిహేనునీ, వాళ్ల సెప్టెంబర్ ఫస్ట్‌నీ - ఇటు రాజీవ్ గాంధీని, అటు గడాఫీని లైన్ డ్రాయింగ్స్ వేసి, ఆ సిటీలో ఉన్న పది పదిహేను దేశాల వాళ్లందర్నీ ఇన్వాల్వ్ చేసి, పదిహేను రోజులు రిహార్సల్స్ చేయించి, ఓ రాత్రంతా మేరథాన్ ప్రోగ్రామ్ అర్గనైజ్ చేసి అదరగొట్టాననిపించుకున్నాను. ఇది గడాఫీకి తెలిసి, మా ముదీర్ (హాస్పిటల్ డెరైక్టర్) ద్వారా నాకు ప్రత్యేక శుభాకాంక్షలు పంపాడు. ఇది మీతో చెప్పుకోవద్దా. దటీజ్ గడాఫీ.
ఇక్కడి వరకూ నేనీ ఆర్టికల్ రాయడానికి గల అర్హతను మీ ముందుంచే ప్రయత్నం చేశాను.
- ఇక్కడ్నుంచే అసలు విషయం-


లిబియన్ నియంత కల్నల్ మొ అమ్మర్ గడాఫీ తెలివైనవాడు. రాజును దింపి ‘రివల్యూషన్’ తెచ్చినవాడు. ఇప్పుడా రివల్యూషనరీనే దింపాలన్న రివల్యూషన్ అక్కడ మొదలైంది. దీనిలో పది పర్సెంట్ లిబియన్స్ ఐతే, తొంభై శాతం అల్‌ఖైదా వాళ్లేనంటాడు గడాఫీ. కావడానికి ముస్లిం కంట్రీయే అయినా లిబియాలో మతానికి మరీ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. స్ర్తీలకు బురఖాల్లాంటి ఆంక్షలేమీ లేవు. ఇది అప్పట్లోనే, అంటే 1987 ప్రాంతాల్లోనే, ఇరాన్ లాంటి దేశాలకు నచ్చేది కాదు. అప్పుడు కొందరు గడ్డాలు పెంచుకున్న ముల్లాల్లాంటివాళ్లు విదేశాల నుంచి దొంగచాటుగా లిబియాలోకి వచ్చి, దేశంలోని అన్ని మసీదుల్లోనూ దాక్కుని, శుక్రవారం ప్రార్థనలకొచ్చిన లిబియన్లకి మత మౌఢ్యాన్ని బోధించసాగారు. కరపత్రాలు కూడా పంచారు. వార్త క్షణాల్లో తెలిసిపోయింది పెద్దాయనకి. అంతే. ఆర్మీ అన్ని మసీదుల్లోకి వెళ్లి అక్కడే ఆ గడ్డాల వాళ్లని కాల్చి పడేయడం, శవాల్ని బైటికీడ్చేయడం 1993 లోగా నాలుగైదుసార్లు జరిగింది. అలా జరిగినప్పుడంతా గడ్డాలున్న లిబియన్లందరూ క్లీన్ షేవ్‌తో తిరగాల్సొచ్చేది. గడ్డం పెంచితే షూట్ ఎట్ సైట్ ఆర్డరిచ్చిన గడాఫీ, తెలుగులో సార్థక నామధేయుడయ్యాడు ‘గడ్డాల్ని ఆపి’.http://arabia2day.com/wp-content/uploads/2011/03/83144936_Gaddafi_123035d.jpg
లిబియా విస్తీర్ణం చాలా ఎక్కువ. జనాభా తక్కువ. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ఎడారి ‘సహారా’ అక్కడే ఉంది. మరోవైపు బార్డరంతా మెడిటరేనియన్ సముద్రం. వాతావరణం గొప్పది. అక్కడ మూణ్ణెల్లు సమ్మర్. మన ఆంధ్రా వింటరంత ‘వేడి’గా ఉంటుంది. అక్కడ వాళ్లు సినిమాల్లో, టీవీల్లో ఫ్యాన్లు చూసి అవేంటని అడుగుతారు. ఎడారిలో మాత్రం పగలు యాభై, రాత్రి మైనస్ అయిదూ డిగ్రీలు ఉంటుంది. లిబియన్లు బైట ప్రపంచాన్ని ఈ మధ్యనే చూడ్డం నేర్చుకుంటున్నారు. ప్రపంచంలో కల్లా అతి గొప్ప డ్రైవర్స్ లిబియన్సే. కారైనా, విమానాలైనా ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్సే కాక సేఫెస్ట్ కూడా. అదే వాళ్ల గొప్పతనం. ఫుట్‌బాల్ అంటే పిచ్చి. అదొక్కటే ఆడతారు. చూస్తారు. ఎక్కువమంది లిబియన్స్‌ని ‘అరబ్బీ మురబ్బాలు అనొచ్చు. వాళ్ల కోళ్లకు మూడు కాళ్లు. వాళ్ల మంచాలకి మూడే కోళ్లు. అందుకే పద్దెనిమిదేళ్లొచ్చిన ప్రతి మగాడూ కంపల్సరీ ఆర్మీ ట్రైనింగ్‌కి వెళ్లాలని రూలుందక్కడ.
http://static.guim.co.uk/sys-images/Guardian/About/General/2011/2/21/1298313339914/gaddafi-007.jpg
లిబియాలో ఫాన్లూ, ఏసీలు తప్ప అన్నీ దొరుకుతాయి. అన్నీ సబ్సిడైజ్డ్ రేట్లే. తిండి వస్తువులైతే మరీ చవక. గ్యాసూ, పెట్రోలు, ఆ మాటకొస్తే కార్లు కూడా కారు చౌక. ఉద్యోగం చేసినోళ్లకీ, చెయ్యని వాళ్లకీ కొంచెం తేడాతో నెలజీతాలిస్తారు. ఇక వాళ్లకేం తక్కువని ఈ రెవల్యూషన్? అనే ప్రశ్న తలెత్తకమానదు.

పదవిలో ఉన్న ఏ వ్యక్తికైనా కుర్చీ పోతుందేమోనని ఉండే భయంతో చేసే తప్పులే గడాీఫీ కూడా చేశాడు. జనాలకి ఆలోచించే టైమ్ ఇవ్వకుండా ఎప్పుడూ ఏదో ఓ టెన్షన్‌లో వాళ్లను ఉంచేవాడు. మూణ్ణెళ్లు మార్కెట్స్‌లో సబ్బులుండవు. ఏరియల్ వ్యూలోంచి చూడాలే గానీ, మనుషులంతా దిక్కుతోచని చీమల్లా సబ్బుల కోసం ఊర్లన్నీ తిరిగేస్తుంటారు. మరో యేడు, ఏవో మూడు నెలలు అగ్గిపెట్టెలు ఆపేస్తాడు. ఇంకో సంవత్సరం ఆర్నెల్లు సిగరెట్లు దొరకవు. అప్పుడు వాళ్లంతా రోడ్ల మీద తాగిపారేసిన సిగరెట్ పీకలు, ఫిల్టర్ ల కోసం రాత్రింబవళ్లూ వెదుక్కుంటూ ఉంటారు. సబ్బుల్లేకపోతే ఇటుక రుద్దుకుని, అగ్గిపెట్టెల స్థానే చెకుముకి రాళ్లు కొట్టుకుని దేశమంతా బతకడానికి అలవాటు చేశాడు. ఇదంతా వాళ్లని రాటుదేల్చాలనే సదుద్దేశంతో కాదు, బిజీగా ఉంచాలనేదే బిగ్‌బాస్ ఆలోచన. మట్టిలో చుట్టపీకలేరుకునేవాడు ఇక కుర్చీకేం ఎసరు పెట్టగలడు. అదీ అతని ఎత్తుగడ.


ఇంత తొక్కిపెట్టినా స్ప్రింగుల్లా తలెత్తిన కొందర్ని ఫుట్‌బాల్ స్టేడియంలో, పబ్లిక్‌ని బలవంతంగా లాఠీలతో ఆహ్వానించి, టీవీల్లో లైవ్ ఇస్తూ వారానికి నలుగురేసి చొప్పున బహిరంగ ఉరిశిక్షల్ని అమలు చేసేవాడు. లాకర్ బీ కేసులో ఫ్లైట్‌లో బాంబ్ పెట్టించి పేల్చేసి టెరర్రిస్ట్ కూడా అయ్యాడు.

http://topnews.in/healthcare/sites/default/files/Muammar-Gaddafi12.jpg
గడాఫీ చేసిన గొప్ప పనుల్లో ‘మాన్ మేడ్ రివర్’ ఒకటి. ఎడారిలో నది నిర్మించిన ఘనుడు. గొప్ప గొప్ప బిల్డింగులూ, అత్యంత నాణ్యమైన రోడ్లు, ఫ్లై ఓవర్లు మొన్న బాంబుల దెబ్బకు కుప్పకూలాయి.
ప్రపంచంలోకే అత్యుత్తమ క్వాలిటీ పెట్రోలు లిబియాలోనే ఉంది. దాన్నెక్కువ ధరకు అమ్ముకోవడం తప్పేమీ కాదు. ఇక అమెరికన్ల వ్యవహారం చెప్పేదేముంది? పెట్రోలు ప్రేమికులు కదా. ఆ వాసనున్న దేశాల వైపు ఆకర్షితులౌతారన్నది విశ్వమెరిగిన సత్యం. గడాఫీకిది తెలుసు గనుకే - ముందు నుండి అమెరికా ద్వేషి. అమెరికన్లకు ఈ రివల్యూషన్ కలిసొచ్చింది. గడాఫీని దింపేసి తమకనుకూలమైన గవర్నమెంట్‌న క్కడ ఏర్పాటు చేసుకోవడమే అమెరికా లక్ష్యం. అందుకే భారత్ సహా మిగిలిన చాలా దేశాలీ అమెరికా జోక్యాన్ని సహించడం లేదు.

అసలీ రివల్యూషన్ ఏమిటి? పక్కనున్న ఈజిప్టులో జరిగింది కనుక ఇక్కడా జరగాలా? ఈ రెబల్స్ లీడరెవరు? గడాఫీ అడుగుతున్న ప్రశ్న ఇదే. ‘‘ఎవరికప్పజెప్పమంటారీ దేశాన్ని?’’ బి.బి.సి ఇంటర్వ్యూలో అతను అన్న మాటలు ఇవే.‘‘ఈ రెబల్స్ లిబియన్స్ కాదు. అల్‌ఖైదా ఇన్‌ఫిల్‌ట్రేటర్స్. వాళ్లు మావాళ్లని ఎగదోస్తున్నారంతే. లిబియన్ పీపుల్ దె ఆల్ లవ్ మీ’’ అంటూ ఘంటాపథంగా చెప్పాడు. ఆర్మీ మొత్తం తన చేతుల్లోనే ఉంది. విదేశీ జోక్యం లేకపోతే, ఇలాంటి రెవల్యూషన్స్‌ని అరగంటలో అణిచి పారేసే సత్తా ఉంది.

http://static.guim.co.uk/sys-images/Guardian/Pix/pictures/2011/2/20/1298233710636/Muammar-Gaddafi.-007.jpg
కానీ, దిగి వచ్చి, మెజారిటీ ప్రజలకేం కావాలో తెలుసుకుని తదనుగుణంగా నడుచుకుంటే దేశం సుభిక్షమే అవుతుంది. కానీ ఆ ఛాన్స్ అమెరికావాళ్లివ్వరు. లిబియన్లు డిక్టేటర్‌తో మొహంమొత్తి డెమోక్రసీ కావాలనుకుం టున్నారు. దానికాదేశం రెడీ అవ్వాలంటే ముందు కావలసింది అక్షరాస్యత.
గడాఫీ లేని లిబియా, అమెరికన్ క్రూక్‌లు చింపిన విస్తరే. తొందరలో మీరే చూస్తారుగా!

http://www.swen.ch/tl_files/swen/images/aktuell/Sept%2009/Gaddafi.jpg
  లిబియన్ నియంత కల్నల్ మొ అమ్మర్ గడాఫీ తెలివైనవాడు.
రాజును దింపి ‘రివల్యూషన్’ తెచ్చినవాడు.
ఇప్పుడా రివల్యూషనరీనే దింపాలన్న రివల్యూషన్ అక్కడ మొదలైంది!!


‘‘ఎవరికప్పజెప్పమంటారీ దేశాన్ని?’’ అని
బి.బి.సి ఇంటర్వ్యూలో అడిగారు గడాఫీ.
ఈ రెబల్స్ లిబియన్స్ కాదు. అల్‌ఖైదా ఇన్‌ఫిల్‌ట్రేటర్స్ అంటారాయన.


 

No comments:

Post a Comment