Munich University
కానీ ప్రపంచంలో 100 అత్యుత్తమ విశ్వవిద్యాలయాల జాబితాలో ఈ యూనివర్సిటీ పేరుండటం చూశాక నాకు అర్థమయింది - ఆ హోదాను, నాణ్యతను నిలుపుకోవడానికి వీరు తీసుకునే జాగ్రత్త అది అని...'' అంటున్నారు జర్మనీలో గడచిన ఆరేళ్లుగా ఉంటున్న డాక్టర్ మధురవాణి. మ్యూనిక్ నగరంలో పోస్ట్‌డాక్టరల్ సైంటిస్టుగా పరిశోధన చేస్తున్న ఈ యువతి ఆ దేశం గురించి బోలెడు ఆసక్తికరమైన సంగతులు చెప్పుకొచ్చారు. అవి ఆమె మాటల్లోనే...
"నేను హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ప్లాంట్ బయో టెక్నాలజీలో ఎమ్మెస్సీ చదివాను. అక్కడ మా ప్రొఫెసర్లలో చాలామంది జర్మనీలోని వివిధ యూనివర్సిటీల్లో పరిశోధన చేసినప్పటి అనుభవాలను అప్పుడప్పుడూ చెబుతుండేవారు.
మా పీజీ ఆఖరి రోజుల్లో జర్మనీ శాస్త్రవేత్తల బృందం ఒకటి ఇండియాలో పర్యటించింది. వారి ద్వారా జర్మనీలోని పరిశోధనా అవకాశాలు, ప్రమాణాల గురించి మాకు వివరంగా తెలిసింది. ఆ స్ఫూర్తితోనే నేను ఇక్కడ పీహెచ్‌డీకి దరఖాస్తు పెట్టుకున్నాను. నేను వచ్చేప్పటికి చేయబోయే పరిశోధన గురించి తప్పితే జర్మనీ జీవన విధానం గురించి నాకు అస్సలు అవగాహన లేదు. ఇక్కడికొచ్చాకే అవన్నీ తెలుసుకున్నాను.
భాషన్నా...యాసన్నా ప్రాణం...
జర్మన్లకు వారి భాషంటే ఎంతో ప్రేమ, అభిమానం, గౌరవం అన్నీనూ! మనం స్కూల్ వరకూ తెలుగు చదువుకున్నట్టు వీరు ఇంగ్లిష్, ఫ్రెంచి లాంటి భాషలు చదువుకుంటారంతే. ఉన్నత విద్య సైతం మాతృభాషలోనే అభ్యసిస్తారు. ఉదాహరణకు పీహెచ్‌డీ థీసిస్ కూడా వాళ్ల భాషలోనే రాసుకోవచ్చు. పబ్లిక్ స్థలాల్లో ప్రతీదీ జర్మన్ భాషలోనే రాసుంటుంది. ఇంగ్లీష్ వచ్చినా సరే సాధారణంగా మాట్లాడరు. తప్పని పరిస్థితిలోనే వారి నోటి వెంట ఇంగ్లీష్ వస్తుంది. ప్రత్యేకంగా మేముంటున్న బవేరియా ప్రాంతం వాళ్లకి వారి సంస్కృతి అన్నా, మిగతా జర్మనీ వారి కన్నా వైవిధ్యంగా ఉండే వారి యాసన్నా అమితమైన అభిమానం.
మాటలు తక్కువ...క్రమశిక్షణ ఎక్కువ
జర్మన్లు క్రమశిక్షణకి, సమయపాలనకి పెట్టింది పేరు. బస్‌గాని, రైలుగాని ఏడు ముప్పై ఒకటికి వస్తున్నట్టు షెడ్యూల్ ఉంటే సరిగ్గా ఏడు ముప్ఫై ఒక్క నిమిషంలోనే అది అక్కడ ఉంటుంది. మనుషులు రిజర్వ్‌డ్‌గా ఉంటారనిపిస్తుంది. అపరిచితులు ఎదురుపడితే కొద్దిగా నవ్వుమొహంతో హలో చెప్తారు. బస్సుల్లో రైళ్లలో అస్సలు మాటలు వినపడవు. వినిపించినా చాలా తక్కువ. అందరూ పుస్తకంలోనో, పత్రికల్లోనో తలదూర్చి ఉంటారు. యువత చెవుల్లోనైతే ఐపాడ్, లేదంటే చేతిలో వీడియోగేమ్స్‌తో కనిపిస్తారు తప్పించి అపరిచితులతో మాటామంతీ ఏమీ ఉండదు.
భలే బీర్ ఫెస్ట్...
ఇక్కడివారి ఆహారపుటలవాట్ల గురించి చెప్పాలంటే రకరకాల బ్రెడ్డులు, కేకుల తయారీలో నిష్ణాతులు వీరు. చీజ్‌లను బాగా ఇష్టపడతారు. బంగాళాదుంపలు బాగా పండిస్తారు, తింటారు. కాఫీ చాలా ఎక్కువగా తాగుతారు. ఇక్కడి ప్రత్యేకం అంటే బీఫ్, పోర్క్‌తో తయారుచేసే సాసేజ్‌లు. ఇంక బీర్ విషయానికొస్తే మంచినీళ్ల కన్నా బీర్ ఎక్కువ తాగుతారని అనొచ్చేమో. ఏటా సెప్టెంబర్ చివరి వారంలో మొదలై అక్టోబర్ మొదటి వారంలో ముగిసే బీర్ 'జాతర' ప్రపంచ ప్రసిద్ధిగాంచింది.

'అక్టోబర్ ఫెస్ట్' లేదా 'బీర్ ఫెస్'ట అని పిలిచే ఈ జాతర స్టివల్ ప్రపంచంలోనే అతి పెద్ద ఫోక్ ఫెస్టివల్ అంటారు. ఈ దేశంలో కొన్ని వందల ఏళ్ల నుండి బీరు తయారుచేస్తున్న బ్రూవరీస్ ఉన్నాయి. వాళ్లందరూ ఈ జాతరలో బీరు అమ్ముతారు. మిలియన్ల లీటర్లలోనే అమ్ముడుపోతుంది. ఈ బీర్ ఫెస్ట్ మొదలయ్యి పోయినేడాదికి 200 ఏళ్లు నిండాయట!
సాంకేతిక వ్యవసాయం...
ఇక్కడ బీరుకి ఉన్న ప్రాముఖ్యత తెలిసింది కాబట్టి బార్లీ పంట ఎంత ముఖ్యమైనదో ఊహించగలరు కదా! బార్లీ పంటలో వచ్చే ఒక ఫంగల్ వ్యాధి గురించిన పరిశోధనే మా ఇనిస్టిట్యూట్లో చేస్తుంటాం. ఈ దేశంలో వ్యవసాయం అంటే - బంగాళాదుంప, గోధుమ, బార్లీ, మొక్కజొన్న, రేప్‌సీడ్ పంటలే. టెక్నాలజీ మీద ఎక్కువగా ఆధారపడిన ఆర్థికవ్యవస్థ వీరిది.

ధనవంతులు గ్రామాల్లో నివసిస్తారు..
ఇక్కడ రైతులు చాలా ధనవంతులట. ఎవరికైనా పొలాలు ఉన్నాయంటే, గ్రామాల్లో ఉంటున్నారంటే వాళ్లు బాగా డబ్బున్నవారని అర్థం.
వాతావరణం గురించి చెప్పాలంటే సంవత్సరంలో మూడొంతులు చలికాలమే ఇక్కడ. వణికించే చలి, కుప్పలుతెప్పలుగా మంచు, ఎప్పుడోకానీ కనపడని సూరీడు... ఇలా ఉంటుంది. వసంతం వస్తే మాత్రం రంగురంగుల చెట్లూ పువ్వులతో చాలా అందంగా ఉంటుంది. పచ్చదనం చాలా ఎక్కువ. అలంకరణ అంటే కూడా చాలా ఇష్టం, ఇల్లు కళాత్మకంగా తీర్చి దిద్దుకుంటారు. క్రిస్మస్, ఈస్టర్ వీళ్లు బాగా చేసుకునే పండగలు.
కార్లున్నా...సైకిలే వాడతారు....
నేనుంటున్న మ్యూనిక్ నగరం పశ్చిమ జర్మనీలోని బవేరియా రాష్ట్రంలో ఉంది. ప్రపంచంలో అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన మొదటి పది మహా నగరాల్లో మ్యూనిక్ ఒకటి. నగరంలో కన్నా చుట్టుపక్కల ఉన్న చిన్నచిన్న గ్రామాలలోనే ధనవంతులు నివసిస్తూ ఉంటారు. గ్రామాల్లో జీవించడమే విలాసవంతం ఇక్కడ. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం బస్సులు, ట్రెయిన్లు, లోకల్ ట్రెయిన్లు చాలానే ఉన్నా, కార్ల సంఖ్య కూడా ఎక్కువే. ప్రపంచంలోనే కార్లప్రియులు అత్యధికంగా మోజుపడే బీఎమ్‌డబ్ల్యూ కార్ల పుట్టిల్లు ఈ ఊరే. చిత్రం ఏమంటే అందరికీ కార్లున్నా సైకిళ్ల వినియోగం కూడా ఎక్కువే. డెబ్భైఎనభైయ్యేళ్ల బామ్మలు, తాతలు సైకిళ్ల మీద తిరుగుతుంటే ఆశ్చర్యంగానూ, సరదాగానూ అనిపిస్తుంది. మా ప్రొఫెసర్ కూడా ఎప్పుడో అవసరమైతే తప్ప మామూలుగా సైకిల్ మీదే వస్తారు.
Mandarin Oriental Hotel – Munich
మహిళలపై ప్రత్యేక శ్రద్ధ...
ఇక్కడ పెళ్లిళ్లు చాలా తక్కువ. అలాగని కుటుంబ విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ ఉండవనుకుంటే పొరపాటే! కుటుంబ బంధాల కన్నా వ్యక్తి స్వేచ్ఛకి విలువ ఎక్కువ. చిన్నవయసు నుంచే పిల్లలకు నచ్చింది చేసుకునే స్వేచ్ఛనిస్తారు. ఉదాహరణకు రెండేళ్ల పిల్లాడిని రెస్టారెంట్‌కు తీసుకొస్తే వాడికి మెనూ చదివి వినిపించి వాడికేది కావాలంటే అదే కొనిస్తారు. పెళ్లి చర్చిలో చేసుకోవడంతో పాటు రిజిస్టర్ ఆఫీసులో చేసుకోవడం తప్పనిసరి ఇక్కడ. పిల్లల్ని కనడానికి చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇష్టం లేకపోతే తండ్రి గురించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు.

Munich rated best city in Germany for women
పిల్లలు తల్లి ఇంటి పేరునో, తండ్రి ఇంటి పేరునో వారసత్వంగా తీసుకోవచ్చు. అయినప్పటికీ ఎక్కువశాతం తండ్రి ఇంటి పేరే తీసుకున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ పిల్లల జనన రేటు చాలా తక్కువగనక పిల్లల్ని కనేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. పిల్లలు ఉన్నవారికి పన్నులు తగ్గుతాయి. అలాగే, ప్రతీనెలా కొంత ఎక్స్‌ట్రా జీతం కూడా అందుతుంది. అంతేకాదు ఇక్కడ యూనివర్సిటీల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం కృషి చేసే విభాగం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా మహిళా ఉద్యోగస్తులని ఎక్కువగా రిక్రూట్ చేస్కోవడాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది ప్రభుత్వం.
కిండర్ గార్డెన్‌లో పిల్లలను చేర్పిస్తే తల్లిదండ్రులు కూడా వారానికి కొన్ని గంటలు వారితో గడపాలనేది రూల్. ఆడుతూపాడుతూనే బోలెడు విషయాలు నేర్చుకుంటారు పిల్లలు. బురదలో, మంచులో, వానలో ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటూ కనిపిస్తారు వాళ్లు. మా ఆఫీస్ పక్కనే ఉండే కిండర్ గార్డెన్‌లో పిల్లలను గమనించడం చాలా సరదాగా ఉంటుంది నాకు. మా కొలీగ్ వాళ్ల పిల్లలు అక్కడ ఉన్నప్పుడు తను ఒకరోజు వాళ్లకోసం ఏదైనా ఇండియన్ వంటకం వండి పెట్టమని అడిగింది. నేనూ మరో ఇద్దరు స్నేహితులూ వెళ్లి పాయసం, పులిహోర చేసి పెట్టాము. వాళ్లకి గ్లోబు చూపిస్తూ ఒక్కో వారం ఒక్కో దేశం గురించి కొద్దికొద్దిగా నేర్పిస్తూ ఇండియా వంతు వచ్చినప్పుడు మమ్మల్ని పిలిచారన్నమాట. అదొక సరదా జ్ఞాపకం నాకు.
మ్యానిక్‌లో దీపావళి...
మ్యూనిక్‌లో తెలుగువారు బానే ఉన్నారుగానీ, ప్రత్యేకంగా సంఘంలాంటిది ఏమీ లేదు. తెలుగువారిలో విద్యార్థుల కన్నా ఉద్యోగస్తులు, ఇంజనీర్లు ఎక్కువ. బంగ్లాదేశీ, పాకిస్తానీ.. ఇలా ఆసియా దేశాలవారు నడుపుతున్న దుకాణాలున్నాయి. అక్కడ బియ్యం, కూరగాయలు, మసాలాలు ఇవన్నీ లభిస్తాయి. అలాగే ఇండియన్ రెస్టారెంట్లు కూడా బానే ఉంటాయి. కాకపోతే వాటిలో ఉత్తరాది వంటకాలే ఎక్కువ.
మ్యూనిక్‌లో ఇస్కాన్‌వాళ్ల కృష్ణుడి గుడి ఉంది. అక్కడికి భారతీయులతో పాటు స్థానిక జర్మన్లు కూడా వస్తూ ఉంటారు. వాళ్లలో దాదాపు హిందూమతం తీసుకున్నట్టు మారిపోయి కృష్ణప్రేమలో మునిగితేలే వారు చాలామందే కనిపిస్తారు. ప్రతి ఆదివారం పూజ తర్వాత అన్నసంతర్పణ జరుగుతుంది. ఈ కోవెల వాళ్లు ప్రతి ఏడూ జగన్నాథ రథయాత్ర చేస్తూ దేవుడి ఊరేగింపు ఉత్సవాన్ని మ్యూనిక్ వీధుల్లో చాలా ఘనంగా చేస్తారు. భగవ ద్గీతతో పాటు భారతీయ తత్వాన్ని తెలియజేసే పుస్తకాలను అమ్ముతారు, రకరకాల ప్రసాదాలను చేసి వీధుల్లో అందరికీ పంచిపెడతారు. రెండేళ్ల క్రితం యాత్రలో నేనూ పాల్గొన్నాను. మన సంప్రదాయ భరతనాట్యం నేర్చుకుని అందులో ప్రదర్శన ఇచ్చిన జర్మన్ యువతులను చూసి చాలా ముచ్చటేసింది. తెలుగువాళ్లంతా కలిసి దీపావళి బాగా చేసుకుంటారు.
ఇక్కడ సంతంటే ఎంతో ఇష్టం...
నాకు బాగా ఇష్టమయిన విషయం మరోటి చెప్పాలి. ఇక్కడ వారానికి రెండుసార్లు సంత జరుగుతూ ఉంటుంది. అప్పుడే పొలాల నుంచి తీసుకొచ్చిన తాజా కూరగాయలూ, పండ్లూ, రకరకాల చీజ్‌లు, పువ్వులు, పూలమొక్కలు... ఇవన్నీ అమ్ముతారు. మామూలు సూపర్‌మార్కెట్లలో కంటే ఇక్కడ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మరింత తాజాగా దొరుకుతాయి కాబట్టి. చాలామంది ఈ సంతల్లో అన్నీ కొనుక్కోవడానికే ఉత్సాహం చూపిస్తారు.
మరొకటి - నె లకో రెండు నెలలకో కొన్ని ప్రదేశాల్లో సెకెండ్ హ్యాండ్ వస్తువుల సంత జరుగుతుంది. అక్కడ వస్తువులన్నీ మహా చవక. వసంతమనీ, ఎండాకాలమనీ రకరకాల సమయాల్లో జాతరలు జరుగుతుంటాయి. వీళ్లకివి బాగా ఇష్టం. హస్తకళా నైపుణ్యంతో తయారు చేసిన రకరకాల వస్తువులు అమ్మే స్టాల్స్ విరివిగా కనపడతాయి ఇలాంటి సమయాల్లో.''
" ప్రపంచంలో అత్యున్నత జీవన ప్రమాణాలు కలిగిన మొదటి పది మహా నగరాల్లో మ్యూనిక్ ఒకటి. నగరంలో కన్నా చుట్టుపక్కల ఉన్న చిన్నచిన్న గ్రామాలలోనే ధనవంతులు నివసిస్తూ ఉంటారు. గ్రామాల్లో జీవించడమే విలాసవంతం ఇక్కడ. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ కోసం బస్సులు, ట్రెయిన్లు, లోకల్ ట్రెయిన్లు చాలానే ఉన్నా, కార్ల సంఖ్య కూడా ఎక్కువే. ప్రపంచంలోనే కార్లప్రియులు అత్యధికంగా మోజుపడే బీఎమ్‌డబ్ల్యూ కార్ల పుట్టిల్లు ఈ ఊరే''