మనుషుల రోగాలు నయం చేద్దామని ఎంబిబిఎస్ చదివారు. కాని పరిస్థితుల
ప్రభావం వల్ల నిర్మాణ రంగం వైపు అడుగిడారు. డాక్టరుగా మనుషుల ఆరోగ్యాన్ని
పట్టించుకోలేకపోతేనేం బిల్డర్‌గా ఇళ్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా
చూసుకుంటున్నారు. నాణ్యమైన ఇళ్లను నిర్మించడమే కాకుండా పచ్చదనానికి పెద్ద
పీట వేస్తున్న ఈ డాక్టర్ బిల్డర్ పేరు కె.ఎల్.నారాయణ. నిర్మాణ రంగంలో
'ట్రెండ్‌సెట్' చేసిన నారాయణ పని వివరాలు ఆయన మాటల్లోనే...

"మల్టీనేషనల్, కార్పొరేట్ సంస్థల వలె నేను ఎక్కువ ప్రాజెక్టులు చేపట్టను. చాలా తక్కువే చేస్తాను. అవే నిర్మాణ రంగంలో ట్రెండ్‌సెట్టర్‌లుగా నిలుస్తాయి. ఆర్కిటెక్‌లు ఇచ్చిన ప్లాన్ ఆధారంగానే కట్టినప్పటికీ అంతకుముందు నేను చూసిన, చదివిన పలు అంశాలు వాటికి చేర్చి నిర్మిస్తుంటాను. అందుకే మా కట్టడాలకు ఆదరణ ఎక్కువ.
అందుకు ఉదాహరణ నా ఇరవై యేళ్ల నిర్మాణరంగ సర్వీసులో ఇంతవరకు బ్రోచర్‌లు వేయించడం గాని, ఫ్లెక్సీలు - హోర్డింగులు పెట్టడం, వాణిజ్యప్రకటనలు ఇవ్వడం వంటివేమీ చేయకపోవడమే. నా దగ్గర ఫ్లాట్ కొన్నవాళ్లు బాగుందని చెప్పడం వల్ల మరొకరు వస్తారు. మా నిర్మాణాలపట్ల నమ్మకం, మా దగ్గర కొన్న వాటిని తిరిగి అమ్ముకున్నా మంచి విలువ వస్తుందన్న గ్యారంటీయే కొనుగోలుదారుల్ని మా దగ్గరికి తీసుకొస్తున్నాయి.
పేరుకు తగ్గ పని మాది
1989లో శ్రీ దుర్గ ఎస్టేట్స్ ప్రారంభించి తక్కువ ఆదాయ వర్గాలకోసం జీడిమెట్లలో ఐదు వందల ఇళ్ల సముదాయాన్ని నిర్మించాను. ఇది నా మొదటి ప్రాజెక్ట్. ఆ తరువాత 1993లో ట్రెండ్‌సెట్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించాను. ట్రెండ్‌సెట్ అన్న మా కంపెనీ పేరుకు తగ్గట్టే ఉంటుంది మా పని. యాంత్రికంగా ఏదో చేశాం, ఇచ్చాం అన్నట్టు ఉండదు. చేసేది వ్యాపారమే అయినప్పటికీ అందులో వ్యక్తిగత సంబంధం ఉండడమనేది చాలా ముఖ్యం. అలా ఉన్నప్పుడే వ్యాపారంలో విజయం సాధించడం సులువు. బిల్డర్‌గా నేను వంద ఫ్లాట్లు క ట్టొచ్చు. కాని కొనుగోలుదారుడికి జీవితకాలం కష్టపడి ఆదా చేసుకున్న డబ్బుతో కొనుక్కునే ఇల్లు ఒక్కటే కదా. వాళ్లకది ఎంతో అపురూపం. అందుకే వాళ్ల డబ్బుకి న్యాయం చేసేలా మా నిర్మాణం ఉంటుంది.
పూల మొక్కలు - పచ్చదనం
ఇప్పటివరకు ఎన్నో వెంచర్‌లు చేశాం. కొండాపూర్‌లోని 30 అపార్టుమెంట్‌ల కాంప్లెక్స్, ట్రెండ్‌సెట్ టవర్స్, ఎఎన్ఆర్ సెంటర్, శ్రీదుర్గా టవర్స్, ట్రెండ్‌సెట్ విల్లె, ట్రెండ్‌సెట్ వింటేజ్‌లు మేము కట్టినవే. హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో ట్రెండ్‌సెట్ వింజ్ పేరుతో ఏడు బ్లాక్‌ల గేటెడ్ కమ్యూనిటీ మా సరికొత్త వెంచర్. ఆరు ఎకరాల భూమిలో 280 ఫ్లాట్స్‌తో కట్టిన ఈ నిర్మాణానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.
పార్కింగ్ ఏరియా ఏమాత్రం బయటికి కనిపించకుండా ఐదు ఎకరాల్లో సెల్లార్ కార్ పార్కింగ్ ఏర్పాటుచేశాం. దాని పైభాగమంతా లాన్‌తో కప్పి ఉంటుంది. పార్కింగ్‌లోకి వెళ్లేందుకు డ్రైవ్‌వే ర్యాంప్ ఉంది. సెల్లార్ పార్కింగ్ అనగానే చాలామందికి నీళ్లు నిల్వ ఉండడం గుర్తు రావొచ్చు. అలాంటిదేం ఉండదు. ఒకవేళ వచ్చినా బయటికి పోవడానికి పార్కింగ్‌లో డ్రెయిన్ వ్యవస్థ ఉంది. ఆటోమేటిక్ పంప్ సీవరేజ్ వ్యవస్థ, కలెక్షన్ పిట్‌లు ఉన్నాయి. కలెక్షన్ పిట్ నిండగానే నీళ్లు వాటంతటవే బయటికి పోయేలా ఏర్పాటు ఉంది.
ముంగిట్లోకే అన్నీ...
ఇక్కడ స్విమ్మింగ్‌పూల్‌తో కలిపి క్లబ్ హౌస్ నిర్మించాం. ఎ/సి జిమ్, స్పా, ఇండోర్ గేమ్స్, బాంక్వెట్ హాల్, ఎసి రెస్టారెంట్ లతో పాటు పిల్లల కోసం క్రెచ్ కూడా ఉంది. బాస్కెట్ బాల్, వాలీ బాల్ కోర్టులు, సింథటిక్ ఫ్లోరింగ్‌తో పిల్లలు ఆడుకునేందుకు ఏర్పాట్లు చేశాం. జాగింగ్ ట్రాక్, హెల్త్‌సెంటర్‌లు కూడా ఉన్నాయి. బయటికి వెళ్లే పనిలేకుండా తాజా గాలిని పీలుస్తూ కంటినిండా పచ్చదనాన్ని నింపుకుని ఎంచక్కా వాకింగ్ కూడా చేయొచ్చు. ఎటు చూసినా సిమెంటు కట్టడాలతో నిండిపోతున్న హైదరాబాద్‌లాంటి ప్రదేశంలో ఎటు చూసినా పచ్చదనం, పూలు కనిపించేలా కట్టిందే ట్రెండ్‌సెట్ వింజ్.
కరెంటు కోతలు ఇబ్బంది పెట్టకుండా 100 శాతం పవర్ బ్యాకప్ సౌకర్యం కూడా ఉంది. జనరేటర్ ద్వారా అందించే ఈ కరెంటు ఎంత వినియోగిస్తున్నారో తెలుసుకునేందుకు మీటర్లు ఉన్నాయి. ప్రతి ఇంటికి పైపు గ్యాస్ లైన్లు ఉన్నాయి. గ్యాస్ బ్యాంక్ నుంచి అందించే ఈ గ్యాస్ ఎంత వినియోగిస్తున్నారో మీటర్ల ద్వారా తెలుసుకునే ఏర్పాటుంది. అలాగే ఎస్‌టిపి (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్) కూడా ఉంది. ఫైర్ సేఫ్టీ వ్యవస్థతో పాటు భూకంపాలను తట్టుకునేలా కట్టిన డిజైన్ ఇది. వాస్తుపరంగా కూడా పక్కాగా ఉంది.
ప్రస్తుతం విజయవాడ బెంజిసెంటర్‌లో ఆరుస్క్రీన్లతో మల్టీప్లెక్స్ మాల్ నిర్మిస్తున్నాం. మెట్రో నగరాల్లో మాల్స్ ఎలాగయితే ఉంటాయో వాటికి ఏ మాత్రం తీసిపోకుండా ఉంటుంది ఇది. దీనికి ట్రెండ్‌సెట్ బెంజ్ మాల్ అని పేరు పెట్టాం.
రెసిషన్+ఉద్యమం
నిర్మాణ రంగం బాగా బూమ్‌లో ఉన్నప్పుడు మొదట రెసిషన్ ప్రభావం, ఆ తరువాత తెలంగాణ ఉద్యమ ప్రభావం పడింది. ఇదివరకు శివార్లలో యాభై, వంద ఎకరాలు కొని వెంచర్‌లు కట్టేవాళ్లు. ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. అయితే నాణ్యతతో కట్టిన భవనాలకు డిమాండ్ ఇప్పటికీ బాగానే ఉంది. కాకపోతే ఇదివరకులా పేపర్ మీద చూపించి అమ్ముదామనుకుంటే మాత్రం కుదరదు. బిల్డర్ ట్రాక్ రికార్డును చూసి మాత్రమే కొంటున్నారు. ధరలపైన మాత్రం ఉద్యమ ప్రభావం ఉంది. రియల్ ఎస్టేట్ బూమ్ ఉన్నప్పుడు చదరపు అడుగు నాలుగు వేలు ఉంటే ఇప్పుడది మూడు వేల ఐదొందలకి తగ్గింది.''
మూడు సినిమాలతో మళ్లీ...
నిర్మాణరంగంతో పాటు సినిమాలంటే కూడా చాలా ఇష్టం నాకు. 1990లో సినిమా రంగంలో అడుగుపెట్టాను. ఎస్ గోపాలరెడ్డి (సీనియర్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ)గారితో పరిచయం నన్ను నిర్మాతను చేసింది. శ్రీదుర్గ ఆర్ట్స్ ఏర్పాటుచేసి వెంకటేష్, శ్రీదేవిలతో క్షణక్షణం నిర్మించాం. ఇది మా మొదటి సినిమా. ఆ తరువాత హలో బ్రదర్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, దొంగాట, నిన్నే ఇష్టపడ్డాను, సంతోషం, రాఖీ సినిమాలు వరసగా తీశాం. రాఖీ తరువాత నాలుగేళ్లుగా సినిమా నిర్మించకపోవడానికి కారణం కథలు నచ్చకపోవడమే. ఈ ఏడాది రాంచరణ్ - బోయపాటి శ్రీనివాస్, మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్లలో రెండు సినిమాలు నిర్మించబోతున్నాం. ఎన్టీఆర్‌తో కూడా సినిమా తీయబోతున్నాం.
మంచికథ ఉంటే కొత్త వాళ్లతో అయినా, చిన్న హీరోలతో అయినా సినిమా నిర్మించేందుకు సిద్ధం. పద్ధతిగా, ప్రణాళికగా చేసుకుంటే నష్టం వచ్చే వ్యాపారం కాదు సినిమా. కాకపోతే హిపోక్రసీకి పోకుండా నిజాయితీగా వ్యవహరించాలి. మంచి సినిమా తీసినప్పుడు, మంచి బిల్డింగ్ నిర్మించినప్పుడు కలిగే సంతృప్తిని ఎంత డబ్బు పెట్టినా కొనలేం. ప్రజలతో సంధానమై ఉన్న నిర్మాణ, సినీ రంగాలు రెండూ నమ్మకం, స్థిరత్వం, నిజాయితీల పై ఆధారపడి విజయాలను అందిస్తాయి.

No comments:
Post a Comment