భక్తిభావన మనిషిని సన్మార్గంలోకి నడిపిస్తుంది... ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ నడుంబిగించాలి...నిజమైన ప్రేమ ప్రతిఒక్కరిని కదిలిస్తుంది... ఇటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలతో పలువురు స్వామీజీలు భక్తులను తన్మయులను చేశారు. ఈ ఏడాది హైదరాబాద్‌కు విచ్చేసిన పలువురు స్వాములు తమ బోధనలతో అందర్నీ ఆకట్టుకున్నారు. స్వామి సుఖబోదానంద, స్వామి అమృతస్వరూపా నందపురి, సిద్ధేశ్వరానంద భారతి మహా స్వామి, రాందేవ్ బాబా, ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ రవిశంకర్, బ్రహ్మర్షికుమార్ స్వామీజీలు తమ ప్రబోధనలతో అందర్నీ మంత్రముగ్దులను చేశారు.
జీవాత్మ పరమాత్మలో ఐక్యమవడమే యోగం...
‘భగవద్గీత బోధనలు ప్రపంచ మానవాళి అంద రికీ వర్తిస్తాయి. జీవితంలోని వివిధ దశలను చక్కగా వివరించే గీత బోధనలు అన్ని మతాలకు అతీతంగా ఉంటాయి. జీవితంలో ఎదురయ్యే గడ్డు పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలని వివరించే ఈ బోధనలు అందరికీ అనుసరణీయం’ అని స్వామీజీ ఈ సందర్భంగా బోధించారు. ‘జ్ఞాన యోగం, భక్తి యోగం, ధ్యాన యో గం ద్వారా మన జీవితం పరిపూర్ణమవుతుంది.కేవలం జ్ఞానముంటే సరిపోదు. జ్ఞానంలేని భక్తి పరిపూర్ణతను ఇవ్వదు.
అందుకే ఈ మూడు యోగాలున్న మంత్ర యోగం అత్యంత ప్రధానం. మనలో జీవాత్మ, పరమాత్మ లుంటాయి. జీవాత్మ పరమాత్మతో ఐక్యమవడమే యోగం. ఈ మం త్రాలను నిరంతరం అనుష్టించటం వల్ల యోగసిద్దిని పొందగలము’ అని స్వామీజీ పేర్కొన్నా రు. ‘ప్రతిరోజు ఉదయం దేవుడి వద్ద మంత్రాలను పఠించి, ఉపాసించి, సాధన చేయడం వల్ల శరీరానికి స్వస్థత కలుగుతుంది. మనస్సు కుదుటపడుతుంది.ఆత్మస్ఠైర్యం అలవడుతుంది. ఒక దైవిక శక్తి మనలో ప్రవేశిస్తుంది. మంత్రాలు ప్రకంపనాలు. అవి మనలో దాగి ఉన్న అహంభావాన్ని కరిగిస్తాయి. సరైన విధానాల ద్వారా సాధన చేస్తే మన జీవితాన్ని తీర్చిదిద్దుకునే పద్ధ తులు లభిస్తాయి.
మనలో దాగి ఉన్న నిగూఢ శక్తులపై ప్రభావం చూపి, ఆ పరమాత్మ అందించే ఆశీస్సులకు అర్హులుగా చేస్తాయి’ అని ఆయన చెప్పారు. ‘మంత్రా లను శ్రద్ధతో అర్థవంతంగా పఠించాలి. అప్పుడే మన లోని మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మనం బిగుసు కుపోయి ఉన్నంతవరకు మార్పురాదు. అలా ఉండడం ఏటికి ఎదురీదటంలాటింది. మనం ఎన్నో వస్తువులతో, వ్యక్తులతో మమేకమవుతాం. అనుబంధం పెంచుకుంటా ము. ఈ బంధాల నుండి విముక్తి పొందటానికి మంత్రాలు దోహదం చేస్తాయి. మంత్రాలను భక్తితో సాధన చేస్తే జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాల అల లపైన సులభంగా తేలిపోవచ్చు’ అని స్వామీజీ బోధించారు.
మానవత్వ విలువలు, ప్రేమాభిమానాలు ఉండాలి...
ఇవే మనిషికి, జంతువులకు మధ్య ఉన్న తేడా. బాధ్యతలు, అవసరాలకు అనుగు ణంగా నడుచుకున్నప్పుడే మనిషి సంతృప్తి కరంగా జీవించగల్గుతాడు. బాధ్యతల కంటే అవసరాలు తక్కువగా ఉన్నప్పుడే మంచి జీవితం సాధ్యమవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఈ రోజుల్లో జవాబుదారీతనం కరువవుతోంది. ఇటీవల స్కామ్‌లలో ఉన్న రాజకీయ నాయకులు, అధికార ప్రముఖుల్లో ఈ జవాబుదారీతనం కనిపించదు. నేడు నగరాల్లో మానవత్వ విలువలు, ప్రేమాభిమానాలు కరువవు తున్నాయి. అందరిలో స్వార్థం, కోపం పెరిగిపోతోంది. ఇవి ఉన్నప్పుడు సమాజం లో శాంతి ఉండదు’ అని బోధించారు. ‘ప్రతి మనిషి సేవా ధృకృథాన్ని అలవర్చు కోవాలి. అందరూ తమ సంపాదనలో కొంత పేద ప్రజలు, అనాథల కోసం వెచ్చించినప్పుడే సమ సమాజ స్థాపన సాధ్యమవుతుంది’ అని ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ వివరించారు.
యోగాతో ఆరోగ్యం...
‘నేడు రాజ యోగ, కర్మ యోగ, జన యోగ, భక్తి యోగ, హఠ యోగలలలో శిక్షణనిస్తున్నారు. మనిషి ఆరోగ్యవంతంగా, చురుగా ఉండాలంటే యోగాను మించింది లేదు’ అని పేర్కొన్నారు. దేశ,విదేశాల్లో యోగాకు విశేష ప్రాచుర్యాన్ని తీసుకు రావడంలో రాందేవ్‌బాబా కీలక పాత్ర వహిం చారు. ప్రముఖ యోగాచార్యునిగానే కాకుండా వివిధ రకాల వ్యాధుల నివారణకు ఆయన తమ దివ్య యోగమందిర్ ట్రస్ట్ ద్వారా ఆయుర్వేద మందులను కూడా అందిస్తున్నారు. ఆయన యోగాసనాలను ప్రత్యక్షంగా లేదా టివి ఛానెల్స్ ద్వారా కొన్ని కోట్ల మంది తిలకిస్తూ వాటిని ప్రాక్టీస్ చేస్తుండడం విశేషం. పతంజలి యోగ్‌పీఠ్ ద్వారా ఆయన అందరికీ ఉచితంగా యోగాసనాలను నేర్పిస్తున్నారు.
ధ్యానంతో ఏకాగ్రత...
అని ఆయన భోధించారు. ‘అశాంతిని వదలించు కొని ఆనందమయ జీవితం గడిపేందుకు తగిన సాధన చేయాలి. ఉన్నంతలో సంతృప్తిగా బతికితే అదే ఆనందాన్ని కలిగిస్తుంది. జీవితంలో శాంతి లభిస్తుంది. ఆశ ఎప్పటికీ మంచిది కాదు. అత్యాశ మనిషిని మానవతా విలువలను కొల్పోయేటట్టు చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆశను విడనాడాలి. నిస్వార్థంగా జీవించినప్పుడే సుఖ, శాంతులు లభిస్తాయి’ అని అన్నారు.‘మరుగున పడిపోయిన మానవ మనుగడ రహస్యాలను ఛేదించాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి’ అని చెప్పారు. మన దేశ సంస్కృతీ, సంప్రదాయాల్లో భాగంగా పూజలు,పునస్కారాలు ఓ భాగంగా కొనసాగు తూ వస్తున్నాయని ఆయన అన్నారు. మంత్రో ఛ్చారణతో మనిషిలో ఓ అద్భుత శక్తి ఏర్పడు తుందని బ్రహ్మర్షి కుమార్ స్వామీజీ అన్నారు.
ప్రేమ, జీవితం రెండూ ఒకటే....
నిజమైన ప్రేమకు ప్రతిరూపంగా మాతా అమృతానందమయి (అమ్మ) నిలుస్తారు’ అని ఆయన బోధించారు. ‘అసతోమా సద్గమ య...తమసోమా జోతిర్గమయ.. మృత్యోర్మా అమృతంగమయ...అనే ప్రార్థన మనకు సత్యదర్శనాన్ని కలిగిస్తుంది. పూజలుపునస్కారా లతో మనస్సు పునీతమై, పవిత్రమై శక్తివంతమౌ తుంది. మన మనస్సును ఆవరించిన మాలిన్యాన్ని ప్రక్షాళన చేస్తుంది. అంతేకా కుండా ఒక అయస్కాంత కేంద్రాన్ని తయారుచేస్తుంది. ఈ కేంద్రం మన శరీరాన్ని, మనస్సుని సేదతీర్చి, ఒక అలౌకిక ఆనందాన్ని సమకూ రుస్తుంది. అప్పుడు జీవితం ఒక గొప్ప అవకాశంగా, దేవుడి చ్చిన వరంగా అను భ వించటానికి వీలవుతుంది. ఇలాంటి అనుభవం కలిగినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే గతం అర్థవం తం గా, భవిష్య త్తు ఆశాజనకంగా ప్రేమల హరిలో ఓలలాడినట్లుగా అనిపి స్తుంది’ అని స్వామి అమృతస్వరూపానంద పురి వివరించారు.
ఆశావహ ధృకృథంతో ముందుకు సాగాలి...
ఈ సందర్బంగా సిద్ధేశ్వరానంద భారతీ మహా స్వామి మాట్లాడుతూ ‘జీవితంలో ఒక దారి మూసుకుపోతే మరో దారి తెరుచుకుంటుంది. మనిషి ఎప్పుడు ఆశావాహ ధృకృథంతో ముందుకుసాగాలి’ ఆయన పిలుపునిచ్చారు.‘జ్ఞాన యోగం, భక్తి యోగం, ధ్యాన యోగం ద్వారా మన జీవితం పరిపూర్ణమవుతుంది.కేవలం జ్ఞానముంటే సరిపోదు. జ్ఞానంలేని భక్తి పరిపూర్ణతను ఇవ్వదు. అందుకే ఈ మూడు యోగా లున్న మంత్ర యోగం అత్యంత ప్రధానం. మనలో జీవాత్మ, పరమాత్మ లుంటాయి.జీవాత్మ పరమాత్మతో ఐక్యమవటమే యోగం. మంత్రాలను నిరంతరం అనుష్టించటం వల్ల యోగసిద్దిని పొందగలము’ అని బోధించారు. ‘వేదాలు జగమే మాయ అని చాటాయి అంటే ఈ ప్రపంచం మిథ్య అని అర్థం కాదు. మన దృష్టి కోణం వల్ల ఏర్పడిన కల్పనలు. అర్థవంతమైన మంత్రసాధన వల్ల ఈ మాయ అనే తెర తొలిగిపోయి సత్యదర్శనం అవుతుంది’ అని చెప్పారు.
-ఎస్. అనిల్‌కుమార్
No comments:
Post a Comment