Saturday, January 1, 2011

కాలిబాట

ఇదో నడిచిపోయే కాలిబాట;
వచ్చింది అడవిగుండా బీటికి, బీటిగుండా ఏటి ఒడ్డుకు, బల్లకట్టు రేవు పక్కగా మర్రిచెట్టు నీడకు. పిమ్మట, ఆ వైపు పడిపోయిన రేవునుండి వంకర తిరిగి వెళ్లిపోయింది ఊరిలోనికి. ఆ మీద పంటచేల అంచుగా, మామిడితోపు నీడలనుండి, తామరకొలను గట్టుమీదుగా, తేరువుండే చోటికి ఓరగా, మరి ఏ ఊరికి వెళ్లి చేరిపోయిందో తెలియదు.
ఈ బాటమీద ఎందరెందరు జనులు; కొందరేమో నా ప్రక్కనే వెళ్లిపోయారు. కొందరు కూడా తోడు నడిచారు. కొందరు దూరాననే కనబడ్డారు.
కొందరి తలలపై మేలి ముసుగులు. కొందరికి లేవు. కొందరు కడవలతో నీళ్లు తెచ్చుటకు వెళ్లుతున్నారు. కొందరు నీళ్లు తెచ్చుకుని తిరిగి వస్తున్నారు.
*
ఇప్పుడు పగలు గడిచిపోయింది. చీకటి దట్టమై ముసురుతోంది.
ఒకప్పుడు అనుకొన్నాను, "ఈ బాట నాదే, నా ఒక్కడిది మాత్రమే'' అని. ఇప్పుడు చూస్తే, "ఒక్కసారి మాత్రమే ఈ బాట వెంట నేను వెళ్లుటకు అనుమతి తీసుకొచ్చాను; మరి ఇక లేదు'' అని అనిపిస్తున్నది. నిమ్మపాదు దాటి, ఆ మడుగు గట్టు దాటి, పాడుబడ్డ దేవళాలరేవు, ఏటి మెరక, గొల్లవాని గుడిసె దాటి, వడ్లకుప్పలు దాటి, ఇదివరకు నేనెరిగిన చూపులకోసము, పరిచితములైన పలుకుల కొరకు, తెలిసిన ముఖాల మేడలకై, ఇంకొకసారి తిరిగివెళ్లి, "ఇదో వచ్చాను'' అని అనుటకు వీలు లేదు కాబోలు.
ఈ త్రోవ వెడలిపోయే త్రోవే గాని, తిరిగివచ్చేది కాదు.
ఈ గోధూళివేళ, ఒకసారి వెనుకకు తిరిగిచూచి అనుకుంటున్నాను. "మరచిపోయిన పెక్కు కాలిజాడలతో కూర్చిన కీర్తన ఈ త్రోవ; భైరవ రాగములో కట్టబడింది.''
ఎప్పటినుండో, ఎంతోమంది బాటసారులు వెడలిపోయారు. వారి జీవిత విషయాలు సమస్తమూ ఈ బాట ఒకే ధూళి పంక్తియందు ఇముడ్చుకుని వ్రాసుకొన్నది. ఆ ఒక్క పంక్తీ, ప్రొద్దుపొడిచే దిక్కునుండి ప్రొద్దుక్రుంకే ఒక బంగారు సింహద్వారము నుండి బయలుదేరి మరొక బంగారు సింహద్వారములోనికి వెడుతోంది.
*
"ఓ కాలిబాటా; అనేక కాలాల అనేక సంగతులను నీ ధూళి బంధనాల్లో కట్టివేసికొని, ఏమీ తెలియనిదానివలె దాచి ఉంచుకోవద్దు. నేను నీ ధూళిలో చెవియొగ్గి విం టున్నా; రవంత గుసగుసలతో అంతా నాకు చెప్పి వెయ్యి.''
రేయి నల్ల పర్దా వైపు చూపుడువేలు చాపి మాట్లాడకుండా ఉండిపోయింది బాట.
"ఓ కాలిబాటా, ఎందరివో బాటసారులవి, ఎన్నో తలపులు, ఎన్నో కోరికలు, అన్నీ ఎచ్చటికి వెళ్లాయి?''
మూగ బాట మాటలాడదు; తూర్పునుండి పడమటికి మాత్రము సైగలు చేస్తున్నది.
"ఓ కాలిబాటా, నీ గుండెపై లెక్కలేని కాలి అడుగులు ఒకప్పుడు పూల వానవలె పడ్డవే. అవన్నీ నేడు ఎచ్చటా లేవా?'' తన తుది ఎచ్చటో బాటకు తెలుసునా? పోగొట్టుకొన్న పూలు, చప్పుడులేని పాటలు ఎచటికి చేరిపోయాయో, చుక్కల వెలుగుల్లో ఎచ్చట ఆర్పరాని వగపుల దీపావళి పండుగలయ్యాయో?
***
విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ 1919లో రాసిన ఒక భావ చిత్రం. 'లిపిక' పేరుతో రాసిన ఈ స్కెచ్‌లను బెజవాడ గోపాలరెడ్డి 'వానచినుకులు' పేరుతో 1952లో అనువదించారు. దాటి వచ్చిన కాలానికి, జీవితానికి ప్రతీకగా ఎంత గొప్ప తలపోత.

ఆధ్యాత్మికతే ముక్తి మార్గం...

భక్తిభావన మనిషిని సన్మార్గంలోకి నడిపిస్తుంది... ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరూ నడుంబిగించాలి...నిజమైన ప్రేమ ప్రతిఒక్కరిని కదిలిస్తుంది... ఇటువంటి ఆధ్యాత్మిక ప్రవచనాలతో పలువురు స్వామీజీలు భక్తులను తన్మయులను చేశారు. ఈ ఏడాది హైదరాబాద్‌కు విచ్చేసిన పలువురు స్వాములు తమ బోధనలతో అందర్నీ ఆకట్టుకున్నారు. స్వామి సుఖబోదానంద, స్వామి అమృతస్వరూపా నందపురి, సిద్ధేశ్వరానంద భారతి మహా స్వామి, రాందేవ్‌ బాబా, ‘ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌’ రవిశంకర్‌, బ్రహ్మర్షికుమార్‌ స్వామీజీలు తమ ప్రబోధనలతో అందర్నీ మంత్రముగ్దులను చేశారు.

జీవాత్మ పరమాత్మలో ఐక్యమవడమే యోగం...
sukhabhogananda‘సత్యం అనేది ఎక్కడో మబ్బుల్లో దాగిలేదు. అది మన ముందే తాండవిస్తుంది నిరంతరం...కానీ ఆ సత్యాన్ని మన అంతర్నేత్రంతో మాత్రమే చూడగలం’ అని స్వామి సుఖబోధానంద బోధించారు. ‘ప్రేమ యొక్క శక్తే దేవుడు. కానీ శక్తిని ప్రేమించడం అహంకారం’ అని ఆయన పేర్కొన్నారు.ప్రసన్న ట్రస్ట్‌ వ్యవస్థాపక చైర్మన్‌ అయిన ఆయన తన ప్రవచనాలు, సేవా కార్యక్రమాలతో ప్రపంచానికి శాంతి, ప్రేమ సందేశాలను అందిస్తున్నారు. దేశంలోని గొప్ప ఆధ్యాత్మికవేత్తలలో ఒకరైన స్వామి సుఖబోధానంద ఈ ఏడాది హైదరాబాద్‌లో తన ప్రవచ కార్యక్రమాలను నిర్వహించారు.ఇందులో భాగంగా ఆయన భగవద్గీత బోధనలను రాష్టవ్రాసులకు వినిపిం చారు.

‘భగవద్గీత బోధనలు ప్రపంచ మానవాళి అంద రికీ వర్తిస్తాయి. జీవితంలోని వివిధ దశలను చక్కగా వివరించే గీత బోధనలు అన్ని మతాలకు అతీతంగా ఉంటాయి. జీవితంలో ఎదురయ్యే గడ్డు పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలని వివరించే ఈ బోధనలు అందరికీ అనుసరణీయం’ అని స్వామీజీ ఈ సందర్భంగా బోధించారు. ‘జ్ఞాన యోగం, భక్తి యోగం, ధ్యాన యో గం ద్వారా మన జీవితం పరిపూర్ణమవుతుంది.కేవలం జ్ఞానముంటే సరిపోదు. జ్ఞానంలేని భక్తి పరిపూర్ణతను ఇవ్వదు.

అందుకే ఈ మూడు యోగాలున్న మంత్ర యోగం అత్యంత ప్రధానం. మనలో జీవాత్మ, పరమాత్మ లుంటాయి. జీవాత్మ పరమాత్మతో ఐక్యమవడమే యోగం. ఈ మం త్రాలను నిరంతరం అనుష్టించటం వల్ల యోగసిద్దిని పొందగలము’ అని స్వామీజీ పేర్కొన్నా రు. ‘ప్రతిరోజు ఉదయం దేవుడి వద్ద మంత్రాలను పఠించి, ఉపాసించి, సాధన చేయడం వల్ల శరీరానికి స్వస్థత కలుగుతుంది. మనస్సు కుదుటపడుతుంది.ఆత్మస్ఠైర్యం అలవడుతుంది. ఒక దైవిక శక్తి మనలో ప్రవేశిస్తుంది. మంత్రాలు ప్రకంపనాలు. అవి మనలో దాగి ఉన్న అహంభావాన్ని కరిగిస్తాయి. సరైన విధానాల ద్వారా సాధన చేస్తే మన జీవితాన్ని తీర్చిదిద్దుకునే పద్ధ తులు లభిస్తాయి.

మనలో దాగి ఉన్న నిగూఢ శక్తులపై ప్రభావం చూపి, ఆ పరమాత్మ అందించే ఆశీస్సులకు అర్హులుగా చేస్తాయి’ అని ఆయన చెప్పారు. ‘మంత్రా లను శ్రద్ధతో అర్థవంతంగా పఠించాలి. అప్పుడే మన లోని మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మనం బిగుసు కుపోయి ఉన్నంతవరకు మార్పురాదు. అలా ఉండడం ఏటికి ఎదురీదటంలాటింది. మనం ఎన్నో వస్తువులతో, వ్యక్తులతో మమేకమవుతాం. అనుబంధం పెంచుకుంటా ము. ఈ బంధాల నుండి విముక్తి పొందటానికి మంత్రాలు దోహదం చేస్తాయి. మంత్రాలను భక్తితో సాధన చేస్తే జీవితంలో మనకు ఎదురయ్యే కష్టాల అల లపైన సులభంగా తేలిపోవచ్చు’ అని స్వామీజీ బోధించారు.

మానవత్వ విలువలు, ప్రేమాభిమానాలు ఉండాలి...
ravishankar‘భారతీయుల నుంచి మానవత్వ విలువలు, జపనీయుల నుంచి టీమ్‌ వర్క్‌, ఖచ్చి తత్వాన్ని జర్మన్ల నుంచి, మార్కెటింగ్‌ టెక్నిక్స్‌ ను అమెరికన్ల నుంచి నేర్చుకుని ముందుకు పయనించే వారే పూరిపూర్ణమై న మనిషిగా రాణించగల్గుతాడు’ అని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు శ్రీ రవి శంకర్‌ అన్నారు. ఆయన హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ‘మనదేశంలోని ఏదైనా చిన్న గ్రామానికి వెళ్తే అక్కడ మనకు మానవత్వ విలువలు కలిగిన మనుషులు కనిపిస్తారు. ప్రతి మనిషికి మానవత్వ విలువలు ఉండాలి.

ఇవే మనిషికి, జంతువులకు మధ్య ఉన్న తేడా. బాధ్యతలు, అవసరాలకు అనుగు ణంగా నడుచుకున్నప్పుడే మనిషి సంతృప్తి కరంగా జీవించగల్గుతాడు. బాధ్యతల కంటే అవసరాలు తక్కువగా ఉన్నప్పుడే మంచి జీవితం సాధ్యమవుతుంది’ అని ఆయన పేర్కొన్నారు. ‘ఈ రోజుల్లో జవాబుదారీతనం కరువవుతోంది. ఇటీవల స్కామ్‌లలో ఉన్న రాజకీయ నాయకులు, అధికార ప్రముఖుల్లో ఈ జవాబుదారీతనం కనిపించదు. నేడు నగరాల్లో మానవత్వ విలువలు, ప్రేమాభిమానాలు కరువవు తున్నాయి. అందరిలో స్వార్థం, కోపం పెరిగిపోతోంది. ఇవి ఉన్నప్పుడు సమాజం లో శాంతి ఉండదు’ అని బోధించారు. ‘ప్రతి మనిషి సేవా ధృకృథాన్ని అలవర్చు కోవాలి. అందరూ తమ సంపాదనలో కొంత పేద ప్రజలు, అనాథల కోసం వెచ్చించినప్పుడే సమ సమాజ స్థాపన సాధ్యమవుతుంది’ అని ఆధ్యాత్మిక గురువు రవిశంకర్‌ వివరించారు.

యోగాతో ఆరోగ్యం...

baba-ramdev-siddhasana‘ప్రతి రోజూ యోగా చేస్తే మనిషి శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉండగల్గుతాడు. పలు రకాల వ్యాధులకు దూరంగా ఉండాలంటే ప్రతి రోజు యోగా చేయాలి’ అని బోధించారు స్వామి రాందేవ్‌ బాబా.ప్రముఖ యోగా గురు వుగా పేరుగాంచిన రాందేవ్‌ బాబా హైదరాబాద్‌ కు విచ్చేసి యోగాపై కార్యక్రమాన్ని నిర్వహిం చారు.ఈ కార్యక్రమానికి పలువురు అధికార, అనధికార ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాందేవ్‌ బాబా మాట్లాడుతూ ‘మన దేశ సంస్కృతీ,సంప్రదాయాల్లో ఓ భాగమైన యోగాకు ఎంతో చరిత్ర ఉంది.హిందూయిజమ్‌, బుద్దిజమ్‌, జైనిజమ్‌లో ఓ భాగంగా ఇది కొనసాగుతోంది’ అని ఆయన పేర్కొన్నారు.

‘నేడు రాజ యోగ, కర్మ యోగ, జన యోగ, భక్తి యోగ, హఠ యోగలలలో శిక్షణనిస్తున్నారు. మనిషి ఆరోగ్యవంతంగా, చురుగా ఉండాలంటే యోగాను మించింది లేదు’ అని పేర్కొన్నారు. దేశ,విదేశాల్లో యోగాకు విశేష ప్రాచుర్యాన్ని తీసుకు రావడంలో రాందేవ్‌బాబా కీలక పాత్ర వహిం చారు. ప్రముఖ యోగాచార్యునిగానే కాకుండా వివిధ రకాల వ్యాధుల నివారణకు ఆయన తమ దివ్య యోగమందిర్‌ ట్రస్ట్‌ ద్వారా ఆయుర్వేద మందులను కూడా అందిస్తున్నారు. ఆయన యోగాసనాలను ప్రత్యక్షంగా లేదా టివి ఛానెల్స్‌ ద్వారా కొన్ని కోట్ల మంది తిలకిస్తూ వాటిని ప్రాక్టీస్‌ చేస్తుండడం విశేషం. పతంజలి యోగ్‌పీఠ్‌ ద్వారా ఆయన అందరికీ ఉచితంగా యోగాసనాలను నేర్పిస్తున్నారు.

ధ్యానంతో ఏకాగ్రత...

brahmarshi-kumar-shwamiji‘ప్రతిరోజు ధ్యానం చేస్తే మనిషిలో ఏకాగ్రత, శక్తి, సామర్థ్యాలు పెం పొందుతాయి. ధ్యానంతో మనిషి లో సుఖ, శాంతులు వెల్లివిరుస్తా యి’ అని అన్నారు ఆధ్యాత్మికవేత్త బ్రహ్మర్షి కుమార్‌ స్వామీజీ. ఆయన హైదరాబాద్‌లో నిర్వహిం చిన దుఃఖ నివారణ్‌ సమాగం కార్యక్రమంలో ప్రసంగించి భక్తు లను తన్మయులను చేశారు. తన ఆధ్యాత్మిక ప్రసంగంతో అందరినీ మైమరపించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ... ‘దేవుడు అడగకముందే అనేక వరాలు ఇస్తాడు. అదే మాదిరిగా మూల మంత్రాలను జపిస్తే అడ గక ముందే అన్నీ సొంత మవు తాయి. మంత్రోచ్ఛారణతో దుఃఖ నివారణ కలుగుతుంది. ప్రతి రోజు మంత్రాలను పఠిస్తూ పూజా కార్యక్రమాలను నిర్వహించాలి’.

అని ఆయన భోధించారు. ‘అశాంతిని వదలించు కొని ఆనందమయ జీవితం గడిపేందుకు తగిన సాధన చేయాలి. ఉన్నంతలో సంతృప్తిగా బతికితే అదే ఆనందాన్ని కలిగిస్తుంది. జీవితంలో శాంతి లభిస్తుంది. ఆశ ఎప్పటికీ మంచిది కాదు. అత్యాశ మనిషిని మానవతా విలువలను కొల్పోయేటట్టు చేస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆశను విడనాడాలి. నిస్వార్థంగా జీవించినప్పుడే సుఖ, శాంతులు లభిస్తాయి’ అని అన్నారు.‘మరుగున పడిపోయిన మానవ మనుగడ రహస్యాలను ఛేదించాలి. ఇందుకోసం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి’ అని చెప్పారు. మన దేశ సంస్కృతీ, సంప్రదాయాల్లో భాగంగా పూజలు,పునస్కారాలు ఓ భాగంగా కొనసాగు తూ వస్తున్నాయని ఆయన అన్నారు. మంత్రో ఛ్చారణతో మనిషిలో ఓ అద్భుత శక్తి ఏర్పడు తుందని బ్రహ్మర్షి కుమార్‌ స్వామీజీ అన్నారు.

ప్రేమ, జీవితం రెండూ ఒకటే....
swami-amritananda-puriమాతా అమృతానందమయి మఠానికి చెందిన స్వామి అమృత స్వరూపానందపురి హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపచ కార్యక్రమాలతో భక్తులను తన్మయులను చేశారు.‘ప్రపంచానికి పుత్రుడు స్వామి అమృతస్వరూపా నంద పురి. ఆ భగవంతుడు ఓ కొడుకును ప్రపంచానికి అందించేందుకు శక్తి నిచ్చాడు’ అని మాతా అమృతానంద మయి (అమ్మ) చెబుతారు.ఈనేపథ్యంలో స్వామి అమృతస్వరూపానంద పురి హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ‘ప్రేమ, జీవితం రెండు వేర్వేరు కావు. ఇవి రెండూ ఒకటే. స్వచ్చమైన ప్రేమ నిజమైన అందానికి పునాదిగా అవతరిస్తుంది. నిజమైన ప్రేమతోనే జీవితం సార్థకమవుతుంది. దాంతోనే బలం, శక్తి ఉద్భవిస్తుంది.

నిజమైన ప్రేమకు ప్రతిరూపంగా మాతా అమృతానందమయి (అమ్మ) నిలుస్తారు’ అని ఆయన బోధించారు. ‘అసతోమా సద్గమ య...తమసోమా జోతిర్గమయ.. మృత్యోర్మా అమృతంగమయ...అనే ప్రార్థన మనకు సత్యదర్శనాన్ని కలిగిస్తుంది. పూజలుపునస్కారా లతో మనస్సు పునీతమై, పవిత్రమై శక్తివంతమౌ తుంది. మన మనస్సును ఆవరించిన మాలిన్యాన్ని ప్రక్షాళన చేస్తుంది. అంతేకా కుండా ఒక అయస్కాంత కేంద్రాన్ని తయారుచేస్తుంది. ఈ కేంద్రం మన శరీరాన్ని, మనస్సుని సేదతీర్చి, ఒక అలౌకిక ఆనందాన్ని సమకూ రుస్తుంది. అప్పుడు జీవితం ఒక గొప్ప అవకాశంగా, దేవుడి చ్చిన వరంగా అను భ వించటానికి వీలవుతుంది. ఇలాంటి అనుభవం కలిగినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే గతం అర్థవం తం గా, భవిష్య త్తు ఆశాజనకంగా ప్రేమల హరిలో ఓలలాడినట్లుగా అనిపి స్తుంది’ అని స్వామి అమృతస్వరూపానంద పురి వివరించారు.

ఆశావహ ధృకృథంతో ముందుకు సాగాలి...
siddeshwaraఈ ఏడాది మహా శివరాత్రి పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని కుర్తాళం సిద్ధేశ్వర పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీ మహా స్వామి నగరంలో ధర్మరక్షణ మహా యజ్ఞాన్ని నిర్వహించారు. శ్రీ విజ యానందనాథ గురు సేవా సమితి చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వ ర్యంలో ఈ యజ్ఞం జరిగింది. ఈ సందర్భంగా 108 అడుగుల భారీ ఎత్తున మహా శివ లింగ రూపాన్ని నిర్మించి, దానికి అనుబంధంగా చుట్టూ 108 యజ్ఞ కుండాలను ఏర్పరచి, 108 మంది ఋత్విక్కుల సహకారంతో ప్రతిరోజూ శ్రీ దుర్గా, గణేశ, చండీ, సుబ్ర హ్మణ్యాది వహన కార్యక్రమాలు, వివిధ పారాయణలు, విశేషార్చనలతో మహారుద్రయాగాన్ని నిర్వహించారు. మహాశివరాత్రినాడు 108 అడుగుల మహాశివలింగానికి 108 రకాల ద్రవ్యాలతో అభిషేకంచేశారు.

ఈ సందర్బంగా సిద్ధేశ్వరానంద భారతీ మహా స్వామి మాట్లాడుతూ ‘జీవితంలో ఒక దారి మూసుకుపోతే మరో దారి తెరుచుకుంటుంది. మనిషి ఎప్పుడు ఆశావాహ ధృకృథంతో ముందుకుసాగాలి’ ఆయన పిలుపునిచ్చారు.‘జ్ఞాన యోగం, భక్తి యోగం, ధ్యాన యోగం ద్వారా మన జీవితం పరిపూర్ణమవుతుంది.కేవలం జ్ఞానముంటే సరిపోదు. జ్ఞానంలేని భక్తి పరిపూర్ణతను ఇవ్వదు. అందుకే ఈ మూడు యోగా లున్న మంత్ర యోగం అత్యంత ప్రధానం. మనలో జీవాత్మ, పరమాత్మ లుంటాయి.జీవాత్మ పరమాత్మతో ఐక్యమవటమే యోగం. మంత్రాలను నిరంతరం అనుష్టించటం వల్ల యోగసిద్దిని పొందగలము’ అని బోధించారు. ‘వేదాలు జగమే మాయ అని చాటాయి అంటే ఈ ప్రపంచం మిథ్య అని అర్థం కాదు. మన దృష్టి కోణం వల్ల ఏర్పడిన కల్పనలు. అర్థవంతమైన మంత్రసాధన వల్ల ఈ మాయ అనే తెర తొలిగిపోయి సత్యదర్శనం అవుతుంది’ అని చెప్పారు.


-ఎస్‌. అనిల్‌కుమార్‌