అవకాశాలు లేనపుడు సాదాసీదాగా బతకడం వేరు. అవకాశాలు ఉండి కూడా ఒక విశ్వాసంగా, ఒక జీవనసూత్రంగా ఆర్భాటాల్లేని జీవితాన్ని ఎంచుకోవడం వేరు. రెండోదాన్ని మరింత గౌరవిస్తుంది సమాజం. మందూ మాంసాహారం లేకుండా, టీవీ చానెళ్లు లేకుండా, ఉదయం సాయంత్రం ప్రార్థనలతో, పాడీపంటా పాఠశాలా ఆస్పత్రి అన్నిట్నీ తామే నిర్వహించుకుంటూ పాత బంగారంలాంటి ప్రశాంత జీవితాన్ని గడపగలిగిన మనుషులు, ప్రదేశాలు ఇంకా మన మధ్య ఉండడం ఎంత ఆశ్చర్యం! రాధాస్వామి అనుయాయులు విశాఖపట్నంలో నెలకొల్పుకున్న 'దయాల్‌నగర్' అటువంటి ఒక ప్రదేశం.
అనగనగా ఒక కాలనీ.
అక్కడ అందరూ ప్రతిరోజూ ఉదయం ఐదు గంటలకు లే చి సామూహికంగా ప్రార్థన చేస్తారు. తర్వాత పిల్లాపెద్దా ఆడామగా అందరూ అరగంటపాటు శారీరక వ్యాయామం చేస్తారు. అటుపై కాలనీలోనే ఉన్న తోటలు, వ్యవసాయక్షేత్రాల్లో పనిచేస్తారు.
వీలయినంతవరకూ తమకు కావాల్సిన ఆకుకూరలు, కాయగూరలను వాళ్లే పండించుకుంటారు. కాలనీని శుభ్రంగా ఉంచుకోవడం, రాత్రిపూట గస్తీ తిరగడం వంటివన్నీ వారే చేసుకుంటారు. ఏ ఇంట్లోనూ కేబుల్ కనెక్షన్ ఉండదు. రాత్రి తొమ్మిదికల్లా నిద్రపోయే ఈ కాలనీవాసుల్లో కులమతాలు, ఆస్తిఅంతస్తుల పట్టింపులుండవు.

సరళం, సామాన్యం
రాధాస్వామి మతస్తులయిన వారు నిరాడంబరతకు పెద్దపీట వేస్తారు. వీరు శాకాహారాన్నీ, అదీ పరిమితంగానే భుజించాలి. మద్యం, ఇతర ఉత్ప్రేరకాలను ముట్టుకోకూడదు. "శాకాహారం తింటే జీవులన్నిటి పట్లా గౌరవం, సహానుభూతి పెరుగుతాయి. ఆహారం కోసం ఇతర జీవులను బాధించాలనే ఆలోచన పోతుంది. మద్యం, ఉత్ప్రేరకాలను వదులుకున్నప్పుడు చేస్తున్న పనిమీద ఏకాగ్రత కుదురుతుంది. ఈ మతదీక్ష తీసుకోవడానికి ఇదీ ప్రధాన నియమం'' అంటున్నారు కేబుల్‌మీడియాలో పనిచేస్తున్న రాజు. "నేనీ మతం తీసుకోకముందు ప్రతిరోజూ మాంసాహారం తినేవాణ్ని. బిజినెస్ పనుల పేరుతో ప్రతిరోజూ మద్యం పార్టీలుండేవి. ఇందులోకి వచ్చాక అన్నీ మానేశాను. దాంతో నాలో వచ్చిన మార్పు నాకే స్పష్టంగా తెలుస్తోంది...'' అన్నారాయన. ప్రతిరోజూ ఉదయం సాయంత్రం ప్రార్థన, పగలంతా తమతమ వృత్తివ్యాపారాల్లో నిమగ్నం కావడం- ఇదే వాళ్ల జీవనశైలి. ఏ పనిలోనైనా రాధాస్వామి మతస్తులు ఆడంబరాలకు పూర్తిగా దూరంగా ఉండాలి.
పుట్టినపిల్లలకు బారసాల అయినా, ఎదిగినవారికి పెళ్లయినా, అన్నీ కేవలం ఒక ప్రార్థనతోనే సరి. ప్రేయర్‌హాల్లోనో, ఇంటిలోనో ప్రార్థన చేసి వచ్చినవారికి మిఠాయిలు పంచితే ఆ వేడుక అయిపోయినట్టే. దేనికీ పురోహితులు, హోమం, భోజనాలు, ఇతర తంతు - ఏమీ ఉండదు. అలాగే ఏ సందర్భంలోనూ కానుకలు ఇచ్చిపుచ్చుకోవడాలను ఈ మతం ప్రోత్సహించదు. ఎవరైనా చనిపోయినప్పుడు మృతదేహం దగ్గర ప్రార్థన చేసి శ్మశానానికి తీసుకెళ్లి దహనం చెయ్యడమే. మూడో రోజు మరోసారి సామూహిక ప్రార్థన చేస్తారంతే. సంతాపదినాలు, మైల, పదోరోజు భోజనాలు, కర్మకాండల వంటివేమీ ఉండవు. అన్నిటికన్నా ముఖ్యమైన నియమం ఏమంటే సత్సంగులు (రాధాస్వామి మతస్తులు) ఎవ్వరూ మత విస్తరణకు పూనుకోకూడదు.
ప్రచారానికి ఆమడ దూరంలో ఉండాలి. మాటల్లో చెప్పడం ద్వారా కాకుండా ప్రవర్తన ద్వారా తమ విశిష్టతను లోకానికి చాటడమన్నది వాళ్లెంచుకున్న మార్గం. అందువల్ల రాధాస్వామి మార్గం గురించి విరివిగా ప్రవచనాలు, హోరెత్తించే సభలు జరగవు. అయినా దీని గురించి తెలుసుకున్న వేల మంది ప్రతియేటా ఈ మతంలోకి రావడానికి ప్రవేశాన్ని (ఇనిషియేషన్) కోరుతుంటారు. రాధాస్వామి మతానికి సంబంధించిన పుస్తకాలు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ అన్ని భాషల్లోనూ లభిస్తాయి. కులమతాలకు అతీతంగా ఎవరైనా రాధాస్వామి మతంలోకి రావొచ్చు.
ఆగ్రాలో ఆరంభం...
తాజ్‌మహల్ కారణంగా ప్రేమ్‌నగర్‌గా పేరొందిన ఆగ్రా ఆధునిక కాలంలో దయాల్‌బాగ్ వలన కొత్త గుర్తింపును సొంతం చేసుకుంది. నూటయాభయ్యేళ్లకు పూర్వం ఆగ్రాలో పుట్టిపెరిగిన స్వామి శివదయాల్‌సింగ్ 'దేవుడొక్కడే, ఆయన మనందరిలోనూ ఉన్నాడు. మనలో ఉండే ఆ దైవత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఆధ్యాత్మికంగా ఒక్కో మెట్టూ ఎదగాలి..' అని బోధించేవారు. తన బోధనలకు ఆకర్షితులైన భక్తులకు ఆ దారిలో నడవడమెలాగో సూచనలిచ్చేవారు. మద్యమాంసాలను వదిలిపెట్టి నిర్మలమైన జీవితాన్ని గడపాలని, రోజుకు రెండు గంటల పాటు శబ్దయోగ ధ్యానంలో గడపాలని ఆయన చెప్పేవారు. ఆయన బోధనలకు కేవలం ఆగ్రావాసులే కాకుండా దేశవ్యాప్తంగా భక్తులు తయారయ్యారు.
'రాధ అనే జీవాత్మను పరమాత్ముడైన స్వామిలో ఐక్యం చేసే మార్గమే మన మతం' అని ప్రకటించిన ఆయన సూచనను అనుసరించి రాధాస్వామి సత్సంగ్ ఆగ్రాలో 1861లో ప్రారంభమయింది. స్వామి నిర్యాణానంతరం ఆయన భార్య రాధ అక్కడే ఉండి రాధాస్వామి మతాన్ని కొనసాగించారు. సత్సంగ్ కేంద్రం ఇప్పటికీ ఆగ్రానే. స్వామి శివదయాల్‌సింగ్ తమ్ముడు ప్రతాప్‌సింగ్, భక్తులు షణ్ముఖదాస్, గరీబ్‌దాస్, బాబా జైమల్‌సింగ్‌లు మాత్రం వివిధ ప్రాంతాల్లో నివాసం ఏర్పర్చుకుని రాధాస్వామి మత వ్యాప్తికి కృషి చేశారు. దాంతో హర్యానాలోని దినోద్, రాజస్థాన్‌లోని గంగానగర్, పంజాబ్‌లోని బియాస్, తరణ్‌తారణ్‌లో వీటిలో ముఖ్య కేంద్రాలున్నాయి. వీరిలో బాబా జైమల్‌సింగ్ అవిభాజ్య పంజాబ్‌లో బియాస్ నది ఒడ్డున ప్రారంభించిన సత్సంగ్ ఎక్కువ పేరు గడించింది. కొద్దిపాటి తేడాలతో అన్ని మార్గాల రాధాస్వామి మతస్తులు నమ్మే తత్వం ఒక్కటే.
ఇదీ తత్వం...
కులమతాలకు అతీతంగా సృష్టిలో జననమరణ వలయం ఒకటి ఉంటుందని నమ్మేవారంతా దానినుంచి బయటపడటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. "పరమాత్మను చేరుకునే మార్గం చూపడానికి గురువు అవసరం. గురు సూచనలకు అనుగుణంగా ప్రార్థన చేసినప్పుడు వ్యక్తులు తమలోని దైవత్వాన్ని అనుభూతి చెందగలరు. దానికోసమే సత్సంగం...'' అనేది రాధాస్వామి మతస్తుల నమ్మకం. దానికోసమే ప్రతిరోజూ ప్రభాతవేళ నాలుగు నుంచి ఐదు వరకూ, మళ్లీ ప్రదోషవేళ (సాయంత్రాలు) సామూహిక సత్సంగ్ (ప్రార్థనలు) నిర్వహిస్తారు. ప్రార్థన జరిగే చోట ఎలాంటి ఆడంబరాలు, క్రతువులు ఉండవు. కేవలం పూర్వ గురువులు చెప్పిన శబ్దాలు (పాటల వంటివి) సామూహికంగా గానం చేస్తారు.
ప్రార్థనామందిరంలో వేలమంది ఉన్నా చీమచిటుక్కుమంటే వినిపించేంత నిశ్శబ్దం ఉంటుంది. శబ్దాలను గానం చేసిన తర్వాత గురు ప్రసాదంగా మరమరాలను స్వీకరిస్తారు. రాధాస్వామి మతం ఏ బంధాన్నీ వదులుకొమ్మని చెప్పదు. కుటుంబం, సమాజం, స్నేహితులు, బంధువులు.... అందరి పట్లా తమ బాధ్యతలను నిర్వర్తించమని, అనురాగాలను పెంచుకోమనే చెబుతుంది. గృహస్థ ధర్మానికి మద్దతుగా నిలబడుతుంది. పరమాత్మ కోసమంటూ అన్నిటినీ పరిత్యజించడాన్ని, ఏ పనీ చెయ్యకుండా మరొకరి మీద ఆధారపడి గడిపే జీవనశైలినీ ప్రోత్సహించదు. అయితే 'దేన్నీ ఉచితంగా ఇవ్వొద్దు, అలాగే ఉచితంగా తీసుకోవద్ద'ని చెబుతుంది.
అందరూ పాటించాల్సిందేనా..?
మరి వచ్చే కోడళ్లు, పుట్టే పిల్లల సంగతేంటి? వాళ్లు కూడా అవే నియమాలు పాటించాలంటే కష్టం కదా అనుకుంటారేమో. కుటుంబంలో ఒకరు ఆ మతస్తులైనంత మాత్రాన.. కుటుంబమంతా దాన్ని అనుసరించాలన్న నియమం ఏమీ లేదు. ఉదాహరణకు దయాల్‌నగర్‌లో ఉండే శాంతిస్వరూప్ విషయం తీసుకుందాం. "మా తల్లిదండ్రులు రాధాస్వామి మతస్తులు. చిన్నప్పటి నుంచి నాకు ఈ పద్ధతులతో పరిచయం ఉంది. నేను సత్సంగీనయ్యాను.
కాని నా భార్య కాలేదు. ఆమె తప్పనిసరిగా కావాలనే నియమం ఏమీ లేదు. అయితే ఇంట్లో వేరే మతపూజ, ప్రార్థనలు చెయ్యకూడదనే నియమం ఉంది. అందువల్ల ఆమె పూజాపటాలు, సామగ్రిని ఆమె తల్లిగారి ఇంట్లోనే వదిలేసి వచ్చింది. మా అబ్బాయికి పన్నెండేళ్లు. తను కాస్త పెద్దయ్యాక తనకు ఏ మతం కావాలంటే ఆ మతాన్ని అనుసరించే స్వేచ్ఛ అతనికి ఉంది..'' అంటూ చెప్పుకొచ్చారు శాంతిస్వరూప్. అలాగే ఇక్కడ కులమత పట్టింపులు కూడా ఉండవు. కాలనీ హౌసింగ్ సొసైటీకి అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న స్వరూప్ భార్య, కోడలు, అల్లుళ్లది తలా ఒక కులం. అందరి మత విశ్వాసాలు కూడా ఒక్కటి కాదు. "మేమిద్దరం సత్సంగీలమే. అయితే మా అల్లుడు, కోడలు రాధాస్వామి మతస్తులు కాదు. వాళ్లు ప్రార్థనను బయట చేసుకుంటారు. దానివల్ల ఇంట్లో ఏమీ తేడా రాదు..'' అన్నారు స్వరూప్.
సొమ్ములు వద్దండి...
ప్రతి చిన్న విషయమూ డబ్బుతో ముడిపడిన నేటిరోజుల్లో ఆశ్చర్యంగా అనిపించే విషయమేమంటే - నూటయాభె ౖఏళ్ల రాధాస్వామి సత్సంగ చరిత్రలో తొలి గురువు నుంచి నేటి గురువు వరకూ అందరూ వారివారి వ్యక్తిగత సంపాదన మీదే జీవించడం. తమ భుక్తి గడవటం కోసం, అవసరాల కోసం వారు ఎవ్వరిదగ్గరి నుంచీ విరాళాలు స్వీకరించరు. మరోలా చెప్పుకోవాలంటే భక్తుల సొమ్ము మీద బతికే బాబాలు కాదు వారు. పైగా సంస్థ చేసే మంచి పనులకు తమ జేబులో నుంచే సొమ్మునివ్వడం గమనార్హం. అసలు సత్సంగ్ సొసైటీ భక్తుల నుంచి విరాళాలు స్వీకరించే తీరే మిగిలిన ధార్మిక సంస్థలకు భిన్నంగా ఉంటుంది.
రాధాస్వామి సత్సంగ్‌లో ఇనిషియేషన్ (మౌలిక సభ్యత్వం) లేనివారి నుంచి అసలు ఎలాంటి విరాళమూ స్వీకరించరు. సభ్యుల నుంచి స్వీకరించేది కూడా మనిషికి ఏడాదికి రెండు రూపాయలు, గరిష్టంగా రెండొందల రూపాయలు. సత్సంగ్ భవనాల నిర్మాణాల కోసం ఇవ్వాలనుకుంటే గరిష్టంగా రెండువేల రూపాయలు. ఎంతటి స్తోమత ఉన్నవారైనా అంతకు మించి ఇవ్వడానికి వీల్లేదు. "ఇన్ని రకాల బాబాలు, స్వామీజీలు, సంస్థల గురించి విని ఉంటారు కదా మీరు. ఎవ్వరైనా చందాలొద్దు, దక్షిణలొద్దు అనడం విన్నారా? ఒక్క దయాల్‌బాగ్ సంస్థలు, కాలనీల్లోనే మీకు డబ్బు ప్రసక్తి ఉండదు. అందుకే మా గురువుల గురించిగానీ, మా సంస్థ గురించిగానీ ఎప్పుడూ చెడు వార్తలు రావు..'' అని సగర్వంగా చెప్పారు లక్ష్మి అనే గృహిణి.
విలువలతో కూడిన విద్య
ఇవాళ కాలనీలలో, గేటెడ్ కమ్యూనిటీలలో నిర్మాణం మొదలుపెట్టగానే షాపింగ్ కాంప్లెక్సులకూ, మల్టీప్లెక్సులకూ స్థలాన్ని కేటాయించడం మనం చూస్తున్నాం. కానీ ఆగ్రాలో దయాల్‌బాగ్ కాలనీకి శ్రీకారం చుట్టిన మర్నాడే అక్కడివారు ముందుగా పాఠశాల నిర్మాణానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అలా కోఎడ్యుకేషన్ మిడిల్ స్కూల్‌గా 1917 జనవరి 1న ప్రారంభమైన దయాల్‌బాగ్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ విద్యాసంస్థ 1981కల్లా డీమ్‌డ్ యూనివర్సిటీగా ఎదిగింది. మన దేశంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరుతెచ్చుకుంది. డీఈఐకి చెందిన సుమారు ఎనభై దూరవిద్యాకేంద్రాల్లో విశాఖపట్నం దయాల్‌నగర్ ఒకటి. ఇక్కడ పేద విద్యార్థులు తమ కాళ్లమీద తాము నిలబడేందుకు అవసరమైన వృత్తివిద్యల్లో శిక్షణనిస్తారు. చదువు పూర్తయ్యాక వారు ఉద్యోగాల్లో కుదురుకునేందుకు సైతం దయాల్‌నగర్ డీఈఐ సహకరిస్తుంది.
1915 జనవరి 20న వసంతపంచమి రోజు ఒక మల్బరీ మొక్కను నాటి ఆగ్రా దయాల్‌బాగ్ కాలనీకి శ్రీకారం చుట్టారు. ఒకప్పుడు ఇసుకపర్రలుగా ఉన్న స్థలం వేలమంది సత్సంగుల శ్రమదానంతో కాలం గడిచిన కొద్దీ అందమైన, ఆహ్లాదకరమైన దయాల్‌బాగ్‌గా రూపుదిద్దుకుంది. 1200 ఎకరాల వ్యవసాయక్షేత్రం, అందులోని పంట- అన్నీ వారి కృషి ఫలితమే. నివాస కాలనీలు, పాఠశాలలు, ఆస్పత్రులు, భూములు, పాడి అన్నీ ఉన్నాయి. దేనికీ బయట ప్రపంచం మీద ఆధారపడే అవసరం లేదు. ఆగ్రా దయాల్‌బాగ్ సత్సంగ్ సొసైటీకి మన దేశంలో సుమారు ఐదు వందల కేంద్రాలుండగా, అమెరికా, కెనడా, యూకే, జర్మనీ, సింగపూర్, దుబాయ్, శ్రీలంక, నేపాల్ వంటివి దేశాల్లోనూ దానికి శాఖలున్నాయి.
కాలనీలు కావాలంటే....
విశాఖలోనే కాదు, రాష్ట్రంలోని చాలా ప్రాం తాల్లో - ఆమాటకొస్తే దేశంలో పలుచోట్ల రాధాస్వామి మతస్తులు ప్రత్యేక కాలనీలుగా ఉన్నారు. కొత్తగా ఏర్పడుతున్నారు కూడా. ప్రస్తుతానికి ఉత్తరప్రదేశ్‌లోని రూర్కీ, తమిళనాడు తిరునల్వేలి జిల్లాలోని మేలతిరువేంకటనాథపురమ్, ముంబైలోని పన్వెల్, ఢిల్లీలోని స్వామినగర్, సికింద్రాబాద్‌లో వెస్ట్‌మారేడుపల్లి, విశాఖపట్నం పేరుపొందినవి. ఈమధ్యనే రాజమండ్రి, కాకినాడ, శ్రీకాకుళం వంటి చోట్ల కాలనీలు ఏర్పడ్డాయి. కాలనీల ఏర్పాటుకు రాధాస్వామి సత్సంగ్ సొసైటీ కొన్ని నియమనిబంధనలను విధిస్తుంది. అందులో ముఖ్యమైనది - ఆ ప్రాంతంలో తమ మతపరమైన కార్యక్రమాల నిర్వహణకు తగిన వాతావరణ ం ఉండాలి.
వ్యక్తులు దానికి తగిన క్రమశిక్షణతో మెలగాలి. సభ్యులందరికీ సేవా దృక్పథం ఉండాలి. 2005 మార్చి తర్వాత ఏర్పడిన కొత్త నిబంధనల ప్రకా రం - కొత్త కాలనీల్లో ఎవరికీ ప్రైవేటు ఆస్తులుండవు. అక్కడి భూమి, నిర్మించిన ఇళ్లు అన్నీ రాధాస్వామి సత్సం గ్ సభకో లేదా అక్కడి స్థానిక సత్సంగి సొసైటీకో చెందుతాయి. కాలనీ నిర్మాణానికి అప్పుగానో, డిపాజిట్‌గానో సత్సంగులు ఒక్కొక్కరు లక్ష రూపాయల వరకూ ఇవ్వొచ్చు. దాన్ని కాలనీ ఐదేళ్లలోగా తిరిగిచ్చేస్తుం ది. లక్ష కన్నా ఎక్కువ ఇవ్వగలిగినా సరే, స్థానిక సొసైటీ దాన్ని స్వీకరించదు. ఈ కొత్త నిబంధనలతో మన రాష్ట్రంలో కడప, బొల్లారంలలో కాలనీలు ఏర్పాటయ్యాయి. కాన్పూర్ దగ్గర అమృతపురం, పంజాబ్‌లోని మల్లంపూర్ దగ్గర కూడా ఏర్పాటు కాబోతున్నాయి.
పనిలోనే దైవం
తామంతా కలిసి ఒక సమాజంగా ఉండటమంటే ఇతరులకు దూరంగా ఉండటం కాదని సత్సంగీల నమ్మిక. అందువల్లనే వారు దేశంలోని వివిధ ప్రాంతాల్లోతాము నడిపే పాఠశాలలు, డిస్పెన్సరీలు వంటి వాటిలోకి అందరికీ ప్రవేశం కల్పిస్తారు. అలాగే దైనందిన జీవితంలో అవసరమైన కొన్ని వస్తువులను సత్సంగీలే స్వయంగా తయారుచేసి, తోటివారికి ఉత్పత్తి ధరకే అందిస్తారు. ఉత్పత్తి నైపుణ్యాలను పెంచుకోవడం, సహకారపద్ధతిలో పనిచెయ్యడం, వ్యయం పెరగకుండా చూసుకోవడం వంటివి వారి లక్ష్యాలు.
దేశంలో దాదాపు ముప్ఫై ప్రాంతాల్లో కొవ్వొత్తుల తయారీ, పిల్లల దుస్తుల తయారీ, వస్త్రాల తయారీ వంటివాటిని కుటీర పరిశ్రమలుగా సత్సంగీలు నిర్వహిస్తున్నారు. ఆగ్రా దయాల్‌బాగ్ నుంచి విశాఖ దయాల్‌నగర్ వరకూ అన్నిచోట్లా ఇదే తత్వాన్ని అనుసరిస్తున్నారు. వీరి జీవనశైలి గురించి- మొదటిసారి విన్నప్పుడు 'చక్కగా ఉంది. మనమూ చేరితే బావుండు' అని చాలామందికి అనిపిస్తుంది. అయితే, ఆ జీవన విధానాన్ని పాటించడం అంత సులువు కాదు. ముఖ్యంగా టీవీ, కేబుల్ లేకుండా ఉండటం, మందు, మాంసాహారాన్ని మానడం ఎక్కువమందికి ఇష్టం ఉండదు.
అమ్మడం, కొనడం ఈజీ కాదు
"అంతా బ్రహ్మాండంగా ఉంది. ఇహనేం, ఈ కాలనీలో ఓ ఇల్లు కొనేసుకుంటే సరి. ప్రశాంతమైన జీవనశైలిని ఎంజాయ్ చెయ్యొచ్చు..'' అనుకుంటున్నారా? మీరేకాదు, దయాల్‌నగర్ కాలనీ గురించి విన్నప్పుడు, దానిని చూసినప్పుడు ఎవరికైనా ఇలా అనిపించకమానదు. అయితే అదంత సులువు కాదు. రాధాస్వామి మతస్తులకు తప్ప వేరే వారికి ఇళ్లు అమ్మడం ఇక్కడ నిషిద్ధం. సహకార పద్ధతిలో ఏర్పడిన అక్కడి హౌసింగ్ సొసైటీ ఇళ్లు అమ్మదలచుకున్న సత్సంగీలది ఒకటి, కొనదలచుకున్న సత్సంగీలదొకటి జాబితా సిద్ధంగా ఉంచుకుంటుంది.
ఏదైనా అమ్మకానికి వచ్చినప్పుడు నిరీక్షణ జాబితాలో ఉన్నవారికి తెలియజేస్తే వారు కొనుగోలు చేయవచ్చు. అది కూడా మార్కెట్ రేట్లకు కానేకాదు. ఉదాహరణకు దయాల్‌నగర్ ప్రాంతమంతా ఇప్పుడు గజం ముప్ఫైఐదువేల రూపాయలు పలుకుతుంటే సత్సంగుల మధ్య అమ్మకాలు గజం పద్నాలుగు వేల రూపాయలు (ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ ధరకు) లెక్కనే జరుగుతాయి. ఇక్కడుండాలంటే మీరు ఆ మతాన్ని, వారి క్రమశిక్షణనూ పాటించాల్సిందే.
నేటి గురువు డాక్టర్ ప్రేమ్‌శరణ్ సత్సంగి...
ఒక గురువు నిర్యాణం పొందితే తర్వాతి గురువును ఎంపిక చేసే పని మొదలవుతుంది. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా, ప్రక్రియ సజావుగా సాగడానికి రాధాస్వామి సత్సంగ్ సభకు ఒక పద్ధతి ఉంది. ఇదొక రిజిస్టర్డ్ సొసైటీ. పూర్వ గురువు ప్రస్తావించిన వ్యక్తినే తర్వాతి హుజూర్‌గా ఎంపిక చేస్తారు. అలా ఏ పేరూ ప్రస్తావనకు రానప్పుడు ఎక్కువమంది సత్సంగీలకు అంగీకారమయిన వ్యక్తి గురుపీఠాన్ని అధిరోహిస్తారు. 2003 మేలో పరమగురు డాక్టర్ లాల్‌సాహెబ్ తర్వాత ఎవరన్న ప్రశ్న తలెత్తినప్పుడు దేశం నలుమూలల నుంచి వచ్చిన 25000 మంది సత్సంగీలు ఏకగ్రీవంగా ప్రేమ్‌శరణ్‌ను గురుస్థానానికి ప్రతిపాదించారు. అలా గురువుల పరంపరలో ఎనిమిదో వారిగా ఎన్నికైన హుజూర్ డాక్టర్ సత్సంగి సాహెబ్. ఈయన పేరు ప్రేమ్‌శరణ్ సత్సంగి. ఢిల్లీ ఐఐటీకి అకడమిక్ డీన్‌గా పనిచేసి రిటైరయ్యారు. మే 2003నుంచి గురు స్థానంలో ఉండి భక్తసమాజాన్ని నడిపిస్తున్నారు.
పండగలూపబ్బాలూ
రాధాస్వామి సత్సంగం ప్రారంభమయిన వసంత పంచమి రోజున ఆ మతస్తులు తమ ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. ఇంటిముందు దీపాలు వెలిగించి, కాలనీలను తీర్చిదిద్దుకుంటారు. దీపావళి రోజు టపాసులను కాల్చడం సొమ్మును వృధా చేయడమేనని వీరి నమ్మకం. దానికి బదులు దీపావళిని 'చ్రిల్డన్స్ డే'గా, 'పర్యావరణ దినోత్సవం'గా జరుపుకుంటారు. పర్యావరణప్రియ అంశాల మీద పిల్లలకు పోటీలు నిర్వహించడం, ఆరోజు వారితో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి బహుమతులివ్వడంలో కాలనీవాసులంతా బిజీగా ఉంటారు.
అలాగే మహిళా సొసైటీ ఆరోజు పానీపురీ, హాట్‌చాట్, మంచూరియా వంటివి తయారుచేసి ప్లేటు ఐదు రూపాయలు, మూడు రూపాయల ధరలకు అందుబాటులో ఉంచుతుంది. పోటీలు, ప్రదర్శనలూ ముగిసిన తర్వాత కాలనీవాసులంతా వాటిని ఆనందంగా ఆరగించి ఇంటిదారి పడతారు. ఇదిగాక ఏడాదిలో ఐదారుసార్లు 'భండారా' అనే పర్వదినాన్ని నిర్వహించుకుంటారు దయాల్‌బాగ్ వాసులు. ప్రత్యేక ప్రార్థనలు, గురువుగారితో పాటు 'ప్రీతిభోజన్' ఆ రోజు ప్రత్యేకతలు. హోలీని కూడా బాగా చేసుకుంటారుగానీ, రంగులు జల్లుకోవడం వంటి అట్టహాసాలేమీ ఉండవు.
* అరుణ పప్పు