Wednesday, May 18, 2011

ప్రేమ.. వైరాగ్యాల ఉమర్ ఖయ్యామ్

http://www.studiolum.com/wang/khayyam/khayyam-illustrations-golubev-mosaic.jpg
ఇరాన్‌లోని ఒక చిన్న పట్టణం నిషాపూర్‌లో జన్మించిన ఉమర్ ఖయ్యామ్‌ను రుబాయీ చక్రవర్తిగా చె ప్పుకుంటారు. జీవన తత్వాలను పొదిగేందుకు రుబాయీ ప్రక్రియను వాడుకున్న తొలికవి ఉమర్ ఖయ్యామ్. 1857లో యూరప్‌కు చెందిన అభిమాని ఎడ్వర్డ్ ఫిట్జ్ గెరాల్డ్, ఖయ్యామ్ రుబాయీలను ఆంగ్లంలోకి అనువదించాడు. ఆ తరువాత ఖయ్యామ్ రుబాయీల మాధుర్యం ప్రపంచమంతా వ్యాపించింది. 1048సంవత్సరంలో మే 18న జన్మించి 1131 దాకా తన రుబాయీలతో సాహిత్య లోకాన్ని ఉర్రూతలూపిన ఉమర్ ఖయాం జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా .......
http://www.exoticindiaart.com/details/panels/omar_khayyam_wj36.jpg
అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల క్రితం ఘంటసాల గొంతులోంచి "అంత ము లేని ఈ భువన మంత పురాతన పాంథశాల...'' అన్న పద్యం జాలువారినప్పుడు తొలిసారిగా ఉమర్ ఖయామ్ పేరు తెలుగు జనసామాన్యం లోకి వెళ్లింది.

అలాగే ఓ ఇరవై ఏళ్ల క్రితం ప్రసిద్ధ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ గొంతులో "హైరత్ మే హై ఊంచాయీ భీ గెహరాయీ భీ హై చారో తర ఫ్ బీడ్ భీ, తన్‌హాయీ భీ...'' అన్న ఖయ్యామ్ రుబాయీ ప్రతిధ్వనించినప్పుడు ఆ మాధుర్యంలో భరత ఖండమంతా పులకించిపోయింది.
http://images.exoticindiaart.com/batik/omar_khayyam_bc23.jpg
ప్రేమా? వైరాగ్యమా?
సమాజంలోని అరిష్టాలన్నిటికీ అసలు కారణం ఏమిటీ అని ఒక సాధువును అడిగితే..." మనుషుల్లో వైరాగ్యం సన్నగ్లిలడమే అన్నింటికన్నా పెద్ద కారణం'' అంటూ కుండ బద్దలు కొట్టాడు. కాదా మరి? వైరాగ్యం అంటే సర్వ సంగ పరిత్యాగమని కాదు. జీవితపు క్షణికత్వాన్ని అర్థం చేసుకోవడం. అలా జీవితం మీద భౌతిక విషయాల మీద విపరీతమైన వ్యామోహం పెంచుకోకుండా ఉండడం. ఉమర్ ఖయ్యామ్ రుబాయీలన్నీ ఈ జీవన సత్యాన్నే చాటిచెబుతుంటాయి. భౌతిక విషయాల క్షణికత్వం అర్థం కాకపోతే ఏమవుతుంది? అన్నీ తానే సొంతం చేసుకోవాలనే స్వార్థం పెరిగిపోతుంది. దోపిడీ, వంచనా పెరుగుతాయి. ద్రోహ చింతన, హింసాత్మక ధోరణి పెరుగుతాయి. పగలూ, ప్రతీకారాలతో మనుషులు

రాక్షసులవుతారు. ఇదే కదా జరిగేది?
పైన ప్రస్తావించిన " అంతములేని ఈ భువనమంత'' అన్న పద్యం ఈ లోకం ఒక బాటసారుల సత్రమనే కదా చెబుతుంది. ఈ సత్రంలో సామాన్య జనం నుంచి రాజులు, చక్రవర్తుల దాకా ఎందరెందరో బసచేశారు. అక్కడ నాలుగు రోజులు గడిపి ఒక్కొక్కరే మళ్లీ అంతా ఎటో వె ళ్లిపోయారు. ఇప్పుడ అక్కడ ఎవరి ఆనవాళ్లూ లేవు అంటాడు ఖయ్యామ్.
http://www.exoticindiaart.com/details/panels/omar_khayyam_wd44.jpg
సమాజంలోని అరిష్టాలన్నిటికీ అసలు కారణం ఏమిటీ అని ఒక సాధువును అడిగితే..." మనుషుల్లో వైరాగ్యం సన్నగ్లిలడమే అన్నింటికన్నా పెద్ద కారణం'' అంటూ కుండ బద్దలు కొట్టాడు. కాదా మరి? వైరాగ్యం అంటే సర్వ సంగ పరిత్యాగమని కాదు. జీవితపు క్షణికత్వాన్ని అర్థం చేసుకోవడం. అలా జీవితం మీద భౌతిక విషయాల మీద విపరీతమైన వ్యామోహం పెంచుకోకుండా ఉండడం. ఉమర్ ఖయ్యామ్ రుబాయీలన్నీ ఈ జీవన సత్యాన్నే చాటిచెబుతుంటాయి. భౌతిక విషయాల క్షణికత్వం అర్థం కాకపోతే ఏమవుతుంది? అన్నీ తానే సొంతం చేసుకోవాలనే స్వార్థం పెరిగిపోతుంది. దోపిడీ, వంచనా పెరుగుతాయి. ద్రోహ చింతన, హింసాత్మక ధోరణి పెరుగుతాయి. పగలూ, ప్రతీకారాలతో మనుషులు
http://iranpoliticsclub.net/history/scientists2/images/Omar%20khayyam%206%20Laleh%20Park,%20Tehran.jpg
ఏ కీర్తీ నిలవదు
కీర్తి ప్రతిష్ఠలు రావాలనీ, సమస్త మానవాళికీ తన ప్రతాపమేమిటో తెలియాలనీ, అందరూ తన ముందు దాసోహం అంటూ నిలబడాలని ఎంతో మందికి మహా కోరిక. కానీ, అలా ఆశించిన వారంతా అంతిమంగా ఏమైపోయారు అంటూ, ''ఎందరెందరు చక్రవర్తులు వచ్చారో, ఎన్ని సామ్రాజ్యాల్ని జయించి పరిపాలించారో, ఎంత మహదైశ్వర్యాన్ని అనుభవించారో చూశాం. కానీ వారు వెంట తీసుకుపోయిందేమిటి? వారందరూ, ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోయారు. వాళ్ల గురించి ఇప్పుడు ఎక్కడా ఏ ఆనవాళ్లూ లేవు'' అంటాడు.

అత్యంత సహజంగా జీవించడం మరిచిపోయి, మనుషులు అధికారం, ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారన్నది ఖయ్యామ్ వాదన. ఒక రుబాయీలో ఆ మాటే చెబుతూ... "మనుషుల పైన అధికారం చె లాయించే చక్రవర్తిత్వం కన్నా గొప్పది లేదనుకుంటారు కొందరు...ఈ లోకం కాదు, ఆ లోకంలో స్వర్గం సాధించడమే పరమావధి అని మరికొందరు... చేతుల్లో ఉన్నది వదులుకుని లేనిదేదో కావాలని

దానికోసం పరుగులు తీస్తారు. కానీ, ఎదుటే ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. '' అంటాడు. అయితే, మానవ వైఫల్యాలను మాత్రమే ప్రస్తావించి వదిలేయకుండా జ్ఞాన దిశగా నడిపించే ప్రయత్నం కూడా చేస్తాడు.
http://www.a-w-i-p.com/media/blogs/articles//omar_khayyam_rubiat_42.jpg
ఆనందమే మధువు
ఉమర్ ఖయ్యామ్ దృష్టిలో జీవన తత్వాన్ని అర్థం చేసుకోవడం ద్వారా కలిగే ఆనందమే మధువు. ఆయనకు ఈ లోకం ఒక మధుశాల. ఈ క్రమంలోనే.. "ప్రియా! ఈ గ్లాసును మధువుతో నింపు!, గడిచిన వాటి గురించిన విచారాల్నీ, రేపటి గురించిన భయాల్నీ మనసులోంచి కడిగేసెయ్. ఈ నిమిషాన్ని, నిశ్చల నిర్విచార సమాధిలో నిలుపగల ఉజ్వల మధువుతో నింపు! ఇప్పుడు ఇక్కడ ఉన్నాను.

రేపటికి నేను వేవేల ఏళ్లను కలిపేసుకున్న నిన్నలో కలిసిపోతానేమో ఎవరికి తెలుసు?'' అంటాడు ఖయ్యామ్. జీవితం పట్ల ప్రేమ, మరణాన్ని గురించిన వైరాగ్యం ఈ రెండూ ఖయ్యామ్ రుబాయీల్లో సమాంతరంగా సాగిపోతుంటాయి. జీవితానందం గురించిన ఆరాటం అందరిలోనూ ఉంటుంది. కానీ, మరణాన్ని గురించిన ధ్యాస మాత్రం ఏ కొందరిలోనో తప్ప ఉండదు. అందుకే పదే పదే ఆ స్పృహ కలిగించే దిశగా తన రుబాయీలను నడిపిస్తాడు.
http://www.seawaychina.com/productimages/-main/FIG-Omar-Khayyam-HN2247.jpg
అమృతత్వంలోకి...
"కాలమూ, విధీ కూడబలుక్కుని తమలోని మధురసాన్నంతా వడగట్టి, నిగ్గదీసి, ఎందర్నో అపూర్వ సుందర ఉజ్వల వ్యక్తుల్ని సృష్టించాయి.వాళ్లలో కొందర్ని మనం ప్రేమించాం కూడా. వారంతా ఇప్పుడు ఏమైపోయారు? వారి వంతుకి ఒకటి రెండు గ్లాసుల మధువును సేవించి ఒక్కొక్కరే మృత్యువులోకి పాకి అదృశ్యమైపోయారు.'' అంటాడు. అలా అని అస్తమానం మరణం గురించే ఆలోచిస్తూ ఉండిపోవద్దంటాడు ఒక రుబాయీలో ...

"మనం మట్టిలోకి దిగి మట్టిగా మారిపోయాక, అక్కడ మధువూ ఉండదు, పాటా ఉండదు మనకు చేతనయిందల్లా, ఇప్పుడు మన ముందున్న కాలాన్ని అద్భుతంగా వినియోగించుకోవడం. నిజానికి మనం అంతకన్నా ఏం చెయ్యగలం? అందుకే ఈ క్షణంలో నిలిచి ఇంకే ఆలోచనలూ లేకుండా అమృతంలోకి ఐక్యమవుదాం.''అంటాడు
http://www.okonlife.com/images/saghism.jpg
ఈ క్షణమే సమస్తం
గతంలోని చేదును గుర్తు చేసుకుంటూ కొందరు, భవిష్యత్తు గురించిన భయాలను తలుచుకుని కొందరు వర్తమానాన్ని జారవిడుచుకోవడాన్ని ప్రస్తావిస్తూ , నీ ముందున్న క్షణాల్ని ఆస్వాదించడానికే నీ జీవితం చాలదు. ఈ స్థితిలో గతం, భవిష్యత్తు మీదే గడిపే వారికి ఇక జీవితమేముంది? అంటూ ప్రశ్నిస్తాడు. " మన కాళ్ల కింది నుంచి కాలం ఎట్లా కొట్టుకుపోతోందో, ఎన్నిసార్లు చెప్పుకుని ఏం ప్రయోజనం?ఇంకా పుట్టని రేపూ, పుట్టి చచ్చిన నిన్న. వాటిని తలుచుకుని చిరాకు పడకు. ఈ రోజు హాయిగా తాగి అన్నీ మరిచిపోదాము. ఇప్పుడు అనే ఈ క్షణమే మిగిలింది మనకు'' అంటాడు.
http://fineartamerica.com/images-medium/rubaiyat-of-omar-khayyam-carl-purcell.jpg
అయితే ఎంత వర్తమానంలో తలమునకలై ఉన్నా మృత్యువు నిన్ను సమీపించకుండా ఉండదు. నిజానికి మృత్యువును సంపూర్ణంగా ఆమోదించే వాళ్లే జీవితాన్ని ఆమూలాగ్రం అనుభవిస్తారన్న భావననే ఖయ్యామ్ తన రుబాయీల్లో ఎక్కువగా పొదుగుతాడు. అందులో భాగంగానే "న దిపంచన రోజాపూలు నవ్వుతో పూసినంత కాలం కెంపు మధువును సేవించు. ఏనాడో నల్లని పానీయాన్ని పట్టుకుని మృత్యుదేవత నిన్ను సమీపించినప్పుడు దాన్నీ తాగు. జంకకు.'' అంటాడు.http://www.dollsofindia.com/dollsofindiaimages/sequin-art-paintings/omar-khayyam-and-saki-epitome-of-love-QQ01_l.jpg
వేళాకోళంగా...
ప్రపంచ గమనంలో మానవ జీవితపు నిస్సహాయత గురించి కూడా కొన్ని బలమైన భావాలు ఉన్నాయి. ఈ విషయాలే చెబుతూ "ఎక్కడి నుంచి వచ్చామో, ఎందుకు వచ్చామో తెలీకుండానే ఈ ప్రపంచంలోకి వచ్చాము. ఈ దిక్కుకు పోతున్నామనేది తెలియకుండానే నీళ్లకు మల్లే ఎటు కొట్టుకుపోతున్నామో పోతున్నాం.

అవును మరి! నన్ను అడక్కుండానే, నా ఇష్టం తెలుసుకోకుండానే ఎక్క్డడి నుంచో నన్ను ఇక్కడికి తోసేశారు. నన్ను అడగనైనా అడక్కుండా ఈలోకం నించి ఎక్కడికి గెంటుతారో, గెంటేస్తారు
http://fineartamerica.com/images-medium/omar-khayyam-g-g-dere.jpg
ఈ దూర్తత్వాన్ని మరిపించేందుకు
ప్రియా మధువు వంచు. '' అంటాడు. ఈ నిస్సహాయతల గురించి ఒక పక్క మాట్లాడుతూనే ఒక దశలో "నిన్ను ఈ లోకంలోకి ఈడ్చి తెచ్చి ఏది నిన్ను వేళాకోళం పట్టించిందో దాన్నే నువ్వు వేళాకోళం పట్టించు.'' అంటూ గడుసుతనాన్ని బయటపెడతాడు. ఏమైనా జీవన్మరణ తత్వాల్నీ, వాటిని ఆస్వాదించే వైనాన్నీ అద్భుతంగా చెప్పిన అరుదైన కవిగా ప్రపంచ సాహిత్యంలో ఉమర్ ఖయ్యామ్ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందనేది ఒక పరమ సత్యం.

Sunday, May 15, 2011

సిద్ధార్థుడు బుద్ధుడయిన వేళ * వైశాఖ పౌర్ణమి - బుద్ధ జయంతి.


దారీతెన్నూ లేకుండా పోతున్న ప్రపంచానికి కొత్తదారులు చూపిన మహనీయుడు గౌతమబుద్ధుడు. అనంతవిజ్ఞాన రాశి ఆయన. సాధన ద్వారా నీవు కూడా బుద్ధుడివి కావచ్చు అంటారాయన. వేలవేల సంవత్సరాల తాత్త్విక చింతనను చిగురుటాకులా వణికించి, కోట్లాది మంది మదిలో కొత్త ఆలోచనలు విచ్చుకొనేలా చేసిన మహనీయుడు బుద్ధుడు. వైశాఖ పౌర్ణమి (రేపు) బుద్ధ జయంతి. ఆ సందర్భంగా బుద్ధుని తత్త్వసారాన్ని వివరించే సంఘటనలు స్మరిద్దాం.

బుద్ధుని జీవితం ఒక సాధనా సోపానం. ఆయన తత్త్వం జీవితాన్ని పరిపూర్ణం చేసే అమృతం. తనకు సర్వసుఖాలూ ఉన్నా, ప్రపంచపు దుఃఖాన్ని తొలగించాలన్న తీవ్ర తపన సిదార్థునికి కునుకుపట్టనీయలేదు. భార్య అనురాగం గానీ, తన వారి పట్ల మమత గానీ, ఆయనను ఆపలేకపోయాయి. ఇల్లు విడిచి న డకసాగించాడు. వారాలు, నెలలు గడిచాయి. తిండి లేక, నిద్రలేక నీరసించాడు. అడుగులు తడబడుతుండగా ఒక చెట్టుకిందకు చేరి చతికిలపడ్డాడు. కళ్లు మూతపడ్డాయి. 'ఉరువేల' ఆ ప్రాంతం పేరు. అక్కడికి సమీపంలో ఒక గృహస్తు ఉండేవాడు. అతని పేరు సేనాని. సుజాత అతని కుమార్తె. తన కడుపు పండి, తన ఇంట వెలుగునిండితే రావిచెట్టుకు, నాగదేవత పుట్టకు మొక్కుచెల్లిస్తానని మనసారా ప్రార్థించింది. ఆమె ప్రార్థించినట్లే జరిగింది. మొక్కుతీర్చుకొనేందుకు సిద్ధమైంది సుజాత.

తన సేవకురాలైన పున్నను అడవిలోని మర్రిచెట్టు వద్ద శుభ్రపరచి రమ్మని పంపింది. పున్న అక్కడ శుభ్రం చేసి వచ్చిన వెంటనే సుజాత ఒంటరిగా అడవికి బయలుదేరింది. పుట్ట ఎదుట పాలునిండిన పసిడి గిన్నెను, పాయసం ఉన్న వెండి గిన్నెను ఉంచి భక్తిశ్రద్ధలతో నమస్కరించింది. పుట్టలోని సర్పం బయటకు వచ్చి సుజాతను ఆశీర్వదించింది. చీకటి పడుతుండడంతో ఇంటికి బయలుదేరేందుకు లేచింది సుజాత. త్వరత్వరగా అడుగులు వేస్తున్న సుజాతకు మూలుగు వినిపించింది. అట చూసిన ఆమెకు బంగారు ఛాయతో అలసి పడిన దేహం కనిపించింది. సుజాత ముంగాళ్లపై కూర్చొని అతనిని తట్టింది. అతని తలను ఒడిలో పెట్టుకుంది. అతడు బాగా అలసి స్పృహతప్పిపోయాడని గ్రహించింది. అతని నాలుక ఎండిపోయి ఉంది. దగ్గరలో నీరు లేదు. మరికాసేపు ఆలస్యం చేస్తే అతనికి ప్రాణాపాయం ఉందనిపించింది సుజాతకు.

ప్రేమనేర్పిన తల్లి

దట్టమైన చీకటి వేగంగా ప్రపంచాన్ని ఆవరిస్తున్నది. సుజాతకు ఇంటివద్ద విడిచి వచ్చిన తన నోముల పంట, బంగారుబాబు గుర్తుకు వచ్చాడు. స్పృహతప్పి ఉన్న వ్యక్తిలో తన బాబు రూపం ప్రతిఫలించినట్లయింది! చంటివాడి కోసం దాచుకున్న పాలను ఒక ఆకును దోనెగాచేసి, అందులో పట్టింది సుజాత. స్పృహతప్పి ఉన్న సిద్ధార్థ్దుడి నోటిలో ఆ పాలను పోసింది. కాసేపటికి సిద్ధార్థుడు కళ్లు తెరిచాడు. ఎదుట ఉన్న కరుణామూర్తి 'అమ్మా' అన్నాడు. ఆ తల్లి పులకించిపోయింది. ఆమె లేచినిలబడి, చేయి అందిస్తూ, లే నాయనా! అంది.

కొంచెం ఓపిక తెచ్చుకొని, నా వెంట నడువు. ఈ రాత్రికి నా ఇంట్లో విశ్రాంతి తీసుకొని, స్వస్థత చేకూరగానే నీ గమ్యం వైపు సాగిపో అన్నది. సిద్ధార్థుడు ఆమెతో ఇలా అన్నాడు. అమ్మా! అగమ్యగోచరంగా, చుట్టూ శూన్యమే గోచరిస్తున్న నాకు, నీ మానవత్వంతో వెలుగు కనిపిస్తున్నది. నా అన్వేషణకు అర్థం స్ఫురిస్తున్నది. ఇక నీవు వెళ్లిరా అమ్మా! నా ప్రాణదాతవు నీవు. ఇదే నా ప్రణామం. అంటూ నీరు నిండిన నయనాలతో అంజలి ఘటించి నమస్కరించాడు గౌతముడు. నీకు బుద్ధత్వం సిద్ధించుగాక! అని మనసారా దీవించింది సుజాత. ఆ ప్రేమమూర్తి దీవెనలు వృధాకాలేదు. సిద్ధార్ధుడు బుద్ధుడయ్యాడు. ప్రపంచానికి మార్గదర్శకుడయ్యాడు.

అమృతంగమయ

అసత్యాన్ని ఛేదించి, సత్యాన్ని కనుగొన్న వారిని, చీకటిని చీల్చి కాంతిరేకల్ని కనుగొన్న వారిని, మృత్యువును అధిగమించి అమృతత్త్వాన్ని కనుగొన్ని వారిని ఎవరూ ఏమీ చేయలేరు. అలాంటి వారిపట్ల ద్వేషభావాన్ని పెంచుకుంటే అది వారికే హానిచేస్తుంది. ఆ మహనీయుల గొప్పతనం మరింత ఇనుమడిస్తుంది. ఈ సత్యాన్ని తెలిపే బుద్ధుని జీవితంలోని ఒక సంఘటన ఇది. దేవదత్తుడు గౌతమ బుద్ధుని సమీపబంధువు. మారుటి సోదరుడు. గౌతముడంటే ముందు నుంచీ అతనికి అకారణంగా అసూయ, ద్వేషం. ఒకనాడు కొండపై నుంచి ఒక గుండును గౌతమునిపైకి దొర్లించాడు. ఆ గుండు గౌతముని మీద పడలేదు కానీ, ఆ గుండు కింద ఉన్న పాము దేవదత్తుడిని కాటు వేసింది.

దేవదత్తుడు బాధతో కేకలు వేశాడు. గౌతముడు తన అంగవస్త్రాన్ని చించి, దేవదత్తునికి పాము కరచిన చోట, విషం పైకి ఎగబాక కుండా గట్టిగా కట్టు కట్టాడు. నోటితో విషాన్ని పీల్చి పక్కకు ఉమ్మేశాడు. దేవదత్తునికి ప్రాణభిక్షపెట్టాడు. అతడిని ఇంటికి చేర్చాల్సిందిగా పరిచారకులకు చెప్పాడు. అయినా దేవదత్తుడికి బుద్ధిరాలేదు. రాకుమారుడైన అజాతశత్రువును ఆశ్రయించి, సహాయాన్ని కోరాడు. అజాతశత్రువు అతనికి కొంత పరివారాన్ని ఇచ్చాడు. వారిలో ఒకరిని దేవదత్తుడు ఉసిగొల్పాడు.

బుద్ధుడిని చంపాల్సిందిగా ఆయనపైకి పంపాడు. వాడు ఏకాంతంగా, మౌనంగా, ప్రశాంత వదనంతో కూర్చున్న బుద్ధుడిని సమీపించాడు. ఆయన శరీరం నుంచి వెలువడుతున్న శక్తివంతమైన ప్రేమ తరంగాలు అతనిలో పరివర్తనను కలిగించాయి. ఏమీ చేయలేక వాడు వెనక్కు తిరిగి వచ్చాడు. దేవదత్తుడికి తన అనుభవం చెప్పాడు.

కరుణామూర్తి గౌతముడు

మరోసారి దేవదత్తుడు రాజగృహంలోనే అత్యంత క్రూరమైన నలగిరి అనే మదపుటేనుగును బుద్ధుడిపైకి తోలించాడు. ఒకవేళ మదపుటేనుగు నుంచి తప్పించుకుంటే, వెంటనే ఆయన్ను చంపేందుకు కొందరు విలుకాండ్రను నియమించాడు. బుద్ధుడు తన శిష్యులతో వెళుతున్నప్పుడు భయంకరంగా ఘీంకరించుకుంటూ అటుగా వచ్చింది మదపుటేనుగు. అందరూ పరుగులు తీశారు. కానీ బుద్ధుడు ప్రశాంత దృష్టితో ముందుకు నడిచాడు. దగ్గరకు వచ్చిన ఆ ఏనుగు మంత్ర ముగ్ధలా నిలిచిపోయింది. తనకు ఇంతకు ముందు ఒకసారి ప్రాణభిక్ష పెట్టిన మహనీయుడే ఆయన అని గుర్తించింది. ఆయనముందు మోకరిల్లింది. మావటీవాని అంకుశం పోట్ల వల్ల ఏర్పడిన గాయం నుంచి కారుతున్న రక్తాన్ని చూసి గౌతముడు చలించిపోయాడు. తన అంగవస్త్రంతో ఆ గాయాన్ని తుడిచి, కట్టుకట్టాడు బుద్ధుడు. కృతజ్ఞతా పూర్వకంగా కన్నీరు కారుస్తూ కదిలిపోయింది మత్తగజం.

ప్రేమకు ప్రతిరూపం

గౌతముడిని హత్య చేయించేందుకు దేవదత్తుడు చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. అతని కుటిలబుద్ధి ప్రజలందరికీ తెలిసిపోయింది. వారి నుంచి అతనికి వచ్చే ధర్మాదాయం తగ్గిపోయింది. దేవదత్తుడు చివరకు ఇంటింటికీ వెళ్లి బిచ్చమెత్తి బతకాల్సి వచ్చింది. ఆ బతుకు బతకలేక కోసల రాజు ప్రసేనజిత్తు తనను ఆదరిస్తాడనే గంపెడు ఆశతో అక్కడి వెళ్లాడు. కానీ జరిగింది తెలుసుకున్న కోసల రాజు దేవదత్తుడిని నిర్దాక్షిణ్యంగా తన రాజ్యం నుంచి గెంటి వేశాడు. సోదరుడికే అంతటి హాని తలపెట్టిన వ్యక్తిని ఆదరిస్తే ప్రజలు నవ్విపోతారని గ్రహించిన ప్రసేనజిత్తు అలా చేశాడు. మహనీయుల పట్ల ఈర్ష్యా ద్వేషాలు పెంచుకుంటే అవి రెట్టింపయి వచ్చి, మనల్ని నాశనం చేస్తాయంటారు వివేకానందులు. అందుకు దేవదత్తుని ఉదాహరణగా చెప్పకోవచ్చు. అపారమైన కరుణకు, ప్రేమ స్వభావానికి, శత్రువుకి సైతం హాని తలపెట్టని స్వభావానికి గౌతముడు ప్రతిరూపం... ఆ అద్భుత గుణాలే ఆయనను మహనీయుని చేశాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆయన బోధలను ఆనుసరించేలా, ఆయనను ఆరాధించేలా చేశాయి. 
- రాచమడుగు శ్రీనివాసులు

Thursday, May 12, 2011

అంతరంగ ప్రపంచ ఆవిష్కర్త - జిడ్డు కృష్ణమూర్తి

సమస్య పరిష్కారం కోసం ఎక్కడెక్కడో వెతికి, వేసారి పోయే వారు కొందరు. అసలు సమస్య అంటేనే భయంతో వణికిపోయే వారు కొందరు. మనలో అమితంగా కనిపించే ఈ భయాలు, సమస్యల మూలాలేమిటో చాలా సార్లు ఒకపట్టాన అంతు చిక్కవు. ఇలాంటి సమస్యల పరిష్కారాల స్థావరాలేమిటో తెలియచెప్పిన గొప్ప సత్య విశ్లేషకుడు జిడ్డు కృష్ణమూర్తి. ప్రతి మనిషిలో ఉండే అతని అంతరంగ ప్రపంచాన్నీ, ఆ ప్రపంచమంతా విస్తరించిన అతని అనంత శక్తినీ గుర్తు చేస్తూ, గొప్ప స్పూర్తినింపిన తాత్వికుడు ఆయన. నేడు జిడ్డు కృష్ణమూర్తి జయంతి సందర్భంగా ఒక పునస్మరణ.


సమస్యను అధిగమించేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమయితే భయం ఉండదు. ఆ సంసిద్ధత రావడానికి మనసంతా ఆ సమస్య మీదే లగ్నం కావాలి. కానీ, చాలా సార్లు అలా జరగదు. మనసు అలా లగ్నం కాలేకపోవడానికి సమస్య నుంచి పారిపోవాలనుకోవడమే కారణం. అలా అనుకోకపోతే అసలు భయమే ఉండదు.సమస్యను సరిగ్గా అర్థం చేసుకుంటే పరిష్కారం ఆ సమస్యలోంచే పుట్టుకొస్తుంది. ఎందువల్ల అంటే పరిష్కారం అనేది సమస్యకు వేరేమీ కాదు.


* నీలో ఒక ప్రపంచం ఉంది. ఆ ప్రపంచoలోకి వెళ్లే తాళం చెవి కూడా నీ చేతిలోనే ఉంది. నిజానికి నీలో ఉన్న ఆ ప్రపంచపు ద్వారాన్ని నువ్వు తప్ప మరెవరూ తెరవలేరు. * ఇవన్నీ ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి నోట జాలువారిన సత్యాల్లో మచ్చుకు కొన్ని. జీవితంలోని ప్రతి సంఘటన గురించి, ప్రతి సమస్య గురించి అంత లోతుగా విశ్లేషించిన వ్యక్తి బహుశా మరొకరు ఉండరు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో (మే12, 1895) జిడ్డు కృష్ణమూర్తి జన్మించారు. ఆయన చిన్నతనంలోనే ఆయన తలిదండ్రులు కడపకు వలస వెళ్లారు. కృష్ణమూర్తి పదేళ్ల వయసులో ఉన్నప్పుడే అతని తల్లి చనిపోయింది. తరువాత వారి మకాం కడప నుంచి మద్రాసుకు మారింది. అక్కడున్న కాలంలోనే కృష్ణమూర్తి థియోసాఫికల్ సొసైటీ నిర్వాహకులైన అనీబిసెంట్ దృష్టిలో పడ్డాడు. అప్పటికి ఆమె ఆ సొసైటీకి సంబంధించి ప్రపంచ గురువు అయ్యే యోగ్యతలు ఉన్న వ్యక్తి కోసం గాలిస్తోంది. ఆ లక్షణాలు ఆయనలో కనిపించాయి. అందుకే కృష్ణమూర్తి తండ్రిని ఒప్పించి ఆ గురుస్థానానికి కృష్ణమూర్తిని ఎంపిక చేసింది.


విషాదం నుంచి అంతర్మథన థియోసాఫికల్ సొసైటీలోకి ప్రవేశించిన కొద్ది రోజులకే కృష్ణమూర్తి అమితంగా ప్రేమించే తన తమ్ముడు క్షయవ్యాధితో మరణించాడు. అతని మరణం కృష్ణమూర్తిని తీవ్రమైన అంతర్మధనానికి గురిచేసింది. అది అతని ఆలోచనలను రగిల్చింది. అప్పటి నుంచి జీవిత వాస్తవాలనూ, జీవిత సత్యాలనూ అత్యంత నిశితంగా పరిశీలించడం మొదలయ్యింది. ఆ క్రమంలో గురుత్వం అనే భావనే సరికాదనిపించింది. ప్రపంచ గురువుగా తనను ప్రతిష్టించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ అర్థం లేనివనిపించింది.


సత్యాల్ని ఎవరికి వారు తెలుసుకోవలసిందే. తనకు తెలిసిన సత్యాలను ఎవరైనా ఇతరులతో పంచుకోవలసిందే. అంతే గానీ, ఎవరో గురుస్థానంలో ఉండిపోతే మిగతా వారంతా అతని శిష్యులై అతని చెప్పినవన్నీ వినుకుంటూ పోవడం సరికాదనిపించింది. అందుకే కృష్ణమూర్తి తాను కేంద్రంగా ఉన్న థియోసాఫికల్ సొసైటీని, దాని అనుబంధ సంస్థలన్నిటినీ రద్ధుచేశాడు. ఆ సొసైటీ కి విరాళంగా లభించిన 5 వేల ఎకరాల భూమిని ఆ దాతలకే తిరిగి ఇచ్చేశాడు. ఆ తరువాత వివిధ అంశాల మీద చర్చిస్తూ, ప్రపంచ దేశాలన్నీ పర్యటించడానికే తన జీవితాన్ని వెచ్చించాడు. జీవితంలోని దాదాపు ప్రతి అంశం మీదా మనోవిజ్ఞాన వేత్తలు, తత్వవేత్తలు, విద్యావేత్తలతో సమావేశమై సుదీర్ఘంగా చ ర్చించేవాడు.


మానవ జీవితంలోని వైరుధ్యాలు, ఘర్షణలు, దుఃఖం, అశాంతి, ఒంటరి తనం, అసంతృప్తి వంటి పలు విషయాల మీద ఆయన తన భావాలను వ్యక్తం చేశాడు. ఆయన చర్చించిన వాటిలో 'ఒంటరితనం' అనే విషయానికి ప్రపంచ వ్యాప్తంగా విశేష స్పందన లభించింది. "అణచివేయడం ద్వారానో, నిర్లక్ష్యం చేయడం ద్వారానో ఒంటరితనం ఎప్పుడూ తొలగిపోదు. కిక్కిరిసిన జనసమూహంలో ఉన్నా మనసులో అనుబంధం లేకపోతే నువ్వు ఒంటరితనాన్నే చవిచూస్తావు. మద్యమో మరో వినోదమో ఒంటరితనం నుంచి విముక్తి చేయలేవు. ఆ సమయంలో తాత్కాలికంగా పక్కకు వెళ్లినా ఆ తరువాత ఒంటరితనం మళ్లీ వచ్చి గుండెల మీద వాలిపోతుంది'' అంటాడు.


కృత్రిమ ప్రయత్నాల ద్వారా తాత్కాలిక ఉపశమనమే తప్ప ఒంటరి తనం నుంచి పూర్తిగా బయటపడలేవు అంటారాయన. ఎవరైనా నేరుగా ఒంటరితనపు గుహలోకే ప్రవేశించి నలుమూలలా నిశితంగా పరిశీలిస్తే గాని, ఒంటరిత నపు అసలు కారణాలు బోధపడవు అంటూ... "నిజానికి మన చర్యలన్నీ మనల్ని సంకుచిత పరిచేవిగానే ఉన్నాయి. మన ఆలోచనలు, మన లక్ష్యాలు పైకి ఎంత విశాలంగా కనిపించినా వాటిలో మనుషులు పరస్పరం విడిపోవడానికి దోహదం చేసేవే ఎక్కువ. ప్రతి ఒక్కరూ మరొకరిపై ఆధిపత్యాన్నే ఆశిస్తున్నారు.


ప్రతి పనినీ నీది-నాది అంటూ వేరువేరుగానే చూస్తున్నారు. సంఘాల పేరుతోనో, మతాల పేరుతోనో, దేశం పేరుతోనో అంతా విడివిడిగానే ఉంటున్నారు. మొత్తంగా మన వ్యవహార సరళి అంతా మనం విడిపోవడానికే దారి తీస్తోంది. క్రమంగా ఒక దశలో ఏ చర్యాలేని ఒంటరితనానికి చేరుకుంటాం. మనసులో ఒక శూన్యం ఏర్పడుతుంది. అయితే ఆ శూన్యాన్ని మనం భరించలేం. అందుకే వెంటనే ఆ శూన్యాన్ని పూరించాలని చూస్తాం. ఉన్నతంగానో, హీనంగానో ఎలాగోలా ఆ శూన్యాన్ని, ఆ ఖాళీని పూరించడానికి మన జీవితాన్నే వెచ్చిస్తాం.''అంటాడు. 

'' ఒంటరితనం నుంచి తప్పించుకోవడానికి కొన్నిసార్లు మనం ప్రేమ అన్న పదం మాటున తలదాచుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ, ప్రేమ, ఒంటరితనం ఈ రెండూ ఒకేచోట ఇమడలేవు. నువ్వు ప్రేమించే వ్యక్తి కోసం, నువ్వు అనుకున్న లక్ష్యం కోసమో నువ్వు అంకితం కావచ్చు. అయినా ఒక కటిక చీకటిలా ఒంటరితనం నిన్ను ఆవహించే ఉంటుంది. నువ్వు ప్రేమించినా, కడకు ద్వేషించినా ఒంటరితనం నిన్ను వెన్నంటే ఉంటుంది. కాకపోతే నీకు కొంచెం దూరంలో నీ కోసం ఎదురుచూస్తూ అనుక్షణం నిన్నే గమనిస్తూ కొద్ది క్షణాల పాటు కాస్త వెనక్కి జరిగి ఉండిపోతుంది. అయితే అదంతా మళ్లీ నిన్ను ఆవహించడానికే.'' అంటాడాయన.


అభద్రతా భావం మౌలికంగా ఒంటరితనంలో ఒక అభద్రతా భావం ఉంటుంది. అభద్రతా భావంతో మొదలైన చర్యలు పైకి ఎంత ఉదాత్తత కనిపించినా అవన్నీ మనసులోని సంకుచితత్వానికి కవచాలు మాత్రమే అంటాడు కృష్ణమూర్తి. తనకు తానే అందరికీ దూరమైపోయి కొందరు ఇతరులే తనను దూరంగా తరిమేశారు అనుకుంటారు. తనకెవరో ముప్పు తలపెట్టినట్లు భావించి ఏవో ఆత్మరక్షణా ప్రయత్నాలు మొదలెడతారు. ఇవన్నీ ఒంటరి తనపు భయాన్ని రెట్టింపు చేస్తాయంటారాయన. " శూన్యం నుంచి, అసంపూర్ణత నుంచి, ఒంటరితనం నుంచి పారిపోవాలని చూసే వ్యక్తి నిజనికి వాటికి వేరేమీ కాదు. శూన్యం, అంసపూర్ణత, ఒంటరితనం ఇవన్నీ అతని ఆలోచనల్లోంచి వచ్చినవే.


ఒంటరితనం నుంచి పారిపోవాలనే ఆలోచలన్నిటికీ మూలాలు అక్కడే ఉన్నాయి. దానికి ఎవరూ తమ నుంచి తాము పారిపోలేరు. తమను, తమ ఒంటరి తనాన్ని అర్థం చేసుకోవడం ఒక్కటే ఎవరైనా చేయగలిగేది. అలా కాకుండా వాటిని తనకు వేరుగా భావించినంత కాలం అతడు ఆ ఒంటరితనం నుంచి బయటపడలేడు. అందుకే తానే తన ఒంటరితనమని, తన ఆలోచనా ధోరణే తన ఒంటరితనానికి అసలు కారణమని గ్రహించినప్పుడే ఆ ఒంటరితనం నుంచి సంపూర్ణంగా బయటపడతాడు అంటాడు కృష్ణమూర్తి. తెలుగునేలపై జన్మించి, అంతర్జాతీయ తత్త్త్వవేత్తలలో ఒకరిగా, వారికి సైతం ఆరాధనీయుడుగా ఎదిగిన కృష్ణమూర్తి ఒక కొత్త ఆలోచనా స్రవంతికి మార్గం చూపిన మహనీయుడు.