వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవడం ద్వారా విజయాలు సాధించవచ్చని వేణు.జి. సోమినేని 'వన్ బుక్ ఫర్ లైఫ్ సక్సెస్' పుస్తకం ద్వారా చెబుతున్నారు. వ్యక్తిత్వ వికాస రచనల్లో ఈ పుస్తకం మంచిగుర్తింపు పొందింది. దాన్లోని కొన్ని భాగాలు ...
దురదృష్టవశాత్తు, చాలా కొద్దిమంది మాత్రమే తమ గురించి తాము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒక దశాబ్ద కాలంగా చాలామందిని ఈ ప్రశ్న అడుగుతూ వచ్చా "మీ గురించి మీకు ఏం తెలుసు'' అని. ఆశ్చర్యకరంగా ఎవరూ వెంటనే జవాబు చెప్పలేదు. "ఇది చాలా మంచి ప్రశ్న. ఆలోచిస్తాను'' అని అన్నవాళ్లే ఎక్కువమంది.

ఎడిసన్ తన టీచరుతో' శుద్ధమొద్దు'గా ముద్ర వేయించుకున్నాడు. తెలివి పెద్దగా అవసరం లేని రంగంలోకి వెళ్లమని కూడా ఆయనే సలహా ఇచ్చాడు. అయినా ఎడిసన్ ఎల క్ట్రిక్ బల్బు కనుగొన్నాడు. దానికోసం 9000 ప్రయోగాలు చేశాడు. అతను ఐదు ప్రయత్నాల తర్వాత గాని, 500 ప్రయత్నాల తర్వాత గాని విరమించుకుని ఉంటే మనం ఇప్పటికీ లాంతర్ల, కొవ్వొత్తుల వెలుగుల్లోనే చదువుకుంటూ ఉండేవాళ్లం. ఎడిసన్ కనిపెట్టిన విషయాలే 20 వ శతాబ్దాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లాయి. 1, 093 వస్తువులపై ఆయనకు పేటెంట్ హక్కు ఉందంటే అదేం చిన్న విషయమా!.

సరిగా చదవలేక స్పీల్‌బర్గ్ ఎన్నోసార్లు స్కూలు మానేయాల్సి వచ్చింది. చివరకు సినిమా స్కూల్‌లో కూడా చేరడానికి ఆయన చేసిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతని తక్కువ మార్కులే గ్రేడ్ అందులో చేరడానికి ఆటంకం అయింది. అలాంటి స్పీల్‌బర్గ్ తరువాత కాలంలో ప్రముఖ హాలీవుడ్ దర్శకునిగా పేరుపొందాడు. మూడు ఆస్కార్ అవార్డులను అందుకోవడమే కాకుండా హాలీవుడ్ చరిత్రలో తిరుగులేని దర్శకునిగా నిలిచిపోయాడు.
నాలుగు సంవత్సరాల వయసు వచ్చేంతవరకు ఐన్‌స్టీన్‌కు మాటలు రాలేదు. ఏడు సంవత్సరాల వయసు వచ్చేవరకు చదవలేకపోయాడు. ప్రాథమిక స్కూలు స్థాయిలో ఐన్‌స్టీన్‌ను ఒక మానసిక వికలాంగునిగా చూసేవారు. ఉపాధ్యాయులు ఏదైనా అడిగితే తనలో తాను కూడబలుక్కొని ఆ తరువాత బయటకు చెప్పేవాడు. దాంతో ఉపాధ్యాయులు ఈ విద్యార్థి జీవితంలో ఎందుకూ పనికిరాడని అన్నారు. అలాంటి ఐన్‌స్టీన్ భౌతికశాస్త్రంలో అద్భుతమైన ప్రయోగాలు చేశాడు. సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొని నోబెల్ బుహుమతి అందుకున్నాడు.
జీవితం ఎత్తుపల్లాలమయం. రాత్రి, పగలు, వేసవి, చలికాలంలా అవి ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. ఒక అవరోహణ తర్వాత ఒక ఆరోహణ తప్పకుండా ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు. పైకెళ్లాక కూడా ఆ స్థాయిని నిలబెట్టుకునేందుకు చాలా కృషి చేయాల్సి వుంటుంది. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా క్షణాల్లో కిందికి పడిపోతారు.
ఎదగడానికి దగ్గరి దారి లేదు. ఏ కష్టమూ అనుభవించకుండా ఒకేసారి పైకి వెళ్లడం అసాధ్యం. అందుకే -" నీకు చేదు గురించి తెలియకపోతే తీపిని ఆస్వాదించలేవు.'' అని చెపుతుంది ఒక పాత సామెత. నిన్ను కష్టాల్లోకి తోసిన ప్రతి సందర్భమూ నీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి వచ్చిన ఒక అవకాశంగా భావించాలి. చాలెంజ్‌లను ఎదుర్కోకుండా పరిణతిని సాధించలేం. ఎంత పెద్ద కష్టాన్ని నువ్వు అధిగమించగలిగితే అంత పటిష్టంగా తయారవుతావు.
విజేతగా నిలవాలంటే - సంక్లిష్టసమస్యల్ని పట్టుదలగా పరిష్కరించుకుంటూ, అదే సమయంలో మరిన్ని చాలెంజ్‌లను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సమస్యలు ఒక వేళ నిన్ను కిందికి పడదోసినా నువ్వు దిగులుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంక్లిష్ట సమస్యల్ని పరిష్కరించిన అనుభవం సంపాదించుకున్నావు కనక.
జీవితంలో గెలిచిన వారు తమ గొప్ప క్షణాలను అపజయాలు పాలైనప్పుడే అనుభూతి చెంది ఉంటారు. సమస్యలను పరిష్కరించుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు చెప్పలేనంత ఉత్తేజాన్ని పొంది ఉంటారు. నిజానికి పరాజయంలో ఉన్నప్పుడే ఎవరైనా ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతారు. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ మీముందు ఉంచుతాను.
ఇంగ్లాడులోని గ్లౌసెస్టర్‌షైర్‌లోని చిప్పింగ్ సాడ్‌బరీలో రోలింగ్ పుట్టారు. పోర్చుగల్‌కు చెందిన ఒక జర్నలిస్టును ఆమె వివాహమాడారు. వారికి 1993లో ఒక పాప పుట్టింది. కూతురు పుట్టిన కొన్నాళ్లకే భర్తతో విడాకులు తీసుకున్న రోలింగ్ పాపతో సహా స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌కు చేరుకున్నారు. అప్పుడే హ్యారీపోటర్ రాయడానికి రోలింగ్ సిద్ధపడ్డారు. ఈ సమయం ఆమె జీవితంలో ఎంతో భయానకమైనది.
హ్యారీపోటర్ నవల రాయడానికే కాదు, దాన్ని పబ్లిష్ చేయడానికీ రోలింగ్ ఎన్నో అవరోధాలు అధిగమించాల్సి వచ్చింది. తన కూతురితో కలిసి రెస్టారెంట్‌లో కూర్చుని రాసేవారు. అక్కడైతే చలిలేకుండా వెచ్చగా ఉంటుందని. నవల పూర్తి చేయడానికి స్కాటిష్ ఆర్ట్స్ కౌన్సిల్ వారి ఆర్థిక సహాయం తీసుకున్నారు. అయినా రోలింగ్ కష్టాలు కొలిక్కి రాలేదు. నవలను కొనడానికి ఏ పబ్లిషింగ్ సంస్థా ముందుకు రాలేదు.
చివరకు ఎన్నో తిరస్కరణల తర్వాత యుకెకు చెందిన బ్లూమ్స్‌బరీ సంస్థ నాలుగువేల డాలర్లకు హ్యారీపోట్టర్ నవలను కొనుగోలు చేసింది. ఎంతో కష్టపడి రాసిన ఈ నవలనుఆమె మారుపేరుతో విడుదల చేయాల్సి వచ్చింది. ఎందుకంటే యువకులు స్త్రీలు రాసిన పుస్తకాలంటే పెద్దగా ఆసక్తి చూపరని బ్లూమ్స్‌బరీ భావించింది. జె.కె రోలింగ్ అసలు పేరు జోన్‌కాథలిన్. దానిని జె.కె.గా ఉంచి జె.కె. రోలింగ్ పేరుతో విడుదల చేశారు.
ఆపై హ్యారీపోటర్ సిరీస్ సృష్టించిన సంచలనం తెలిసిందే. పుస్తకాలు రాయడం ద్వారా బిలియనీర్‌గా మారిన తొలి వ్యక్తి జె.కె. రోలింగ్ అని ఫోర్బ్స్ పేర్కొంది. హార్వర్డ్ అల్యుమిని అసోషియేషన్ నిర్వహించిన వార్షికోత్సవ సభలో జె.కె రోలింగ్ తన విజయాల గురించి మాట్లాడుతూ "ఇదంతా అపజయం నుంచి పొందిన లాభమే'' అన్నారు.

మిమ్మల్ని మీరు ఈ కింది ప్రశ్నలు అడిగి చూసుకోండి...
- నేను ఎవరు?
- నా జీవితానికి అర్థం ఏమిటి?
- జీవితాన్ని ఎక్కడ ప్రారంభించాను?
- ఇప్పుడెక్కడ ఉన్నాను?
- నా జీవితానికి స్ఫూర్తినిచ్చేదేమిటి?
- నేను చేస్తున్న పనితో సంతృప్తి చెందుతున్నానా?
- నా సామాజిక సంబంధాలతో సంతోషంగా ఉన్నానా?
- నేను ఎటువైపు వెళుతున్నాను?
- నా అసలైన బలం ఏమిటి?
- నాకు ఇష్టమైన పని ఏమిటి?
- నేను సాధించాలనుకుంటున్నది ఏమిటి?
- నన్ను ఆనందంగా ఉంచే విషయం ఏమిటి?
ఇలా మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అప్పుడు ఇతరులు మీపై ప్రభావం చూపలేరు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ప్రతీ క్షణాన్నీ ఆనందమయం చేసుకోండి.
ప్రముఖుల బాల్యం -అపజయాలు
బాల్యంలో సాదాసీదా చదువులతో నెట్టుకొచ్చిన కొందరు ప్రముఖులు వీరు. ర్యాంకులు, గ్రేడులతో సంబంధం లేకుండా జీవితంలో తిరుగులేని విజేతలుగా నిలిచారు.థామస్ ఎడిసన్
ఎడిసన్ తన టీచరుతో' శుద్ధమొద్దు'గా ముద్ర వేయించుకున్నాడు. తెలివి పెద్దగా అవసరం లేని రంగంలోకి వెళ్లమని కూడా ఆయనే సలహా ఇచ్చాడు. అయినా ఎడిసన్ ఎల క్ట్రిక్ బల్బు కనుగొన్నాడు. దానికోసం 9000 ప్రయోగాలు చేశాడు. అతను ఐదు ప్రయత్నాల తర్వాత గాని, 500 ప్రయత్నాల తర్వాత గాని విరమించుకుని ఉంటే మనం ఇప్పటికీ లాంతర్ల, కొవ్వొత్తుల వెలుగుల్లోనే చదువుకుంటూ ఉండేవాళ్లం. ఎడిసన్ కనిపెట్టిన విషయాలే 20 వ శతాబ్దాన్ని ఎంతో ముందుకు తీసుకువెళ్లాయి. 1, 093 వస్తువులపై ఆయనకు పేటెంట్ హక్కు ఉందంటే అదేం చిన్న విషయమా!.
స్టీఫెన్ స్పీల్‌బర్గ్
సరిగా చదవలేక స్పీల్‌బర్గ్ ఎన్నోసార్లు స్కూలు మానేయాల్సి వచ్చింది. చివరకు సినిమా స్కూల్‌లో కూడా చేరడానికి ఆయన చేసిన మూడు ప్రయత్నాలు విఫలమయ్యాయి. అతని తక్కువ మార్కులే గ్రేడ్ అందులో చేరడానికి ఆటంకం అయింది. అలాంటి స్పీల్‌బర్గ్ తరువాత కాలంలో ప్రముఖ హాలీవుడ్ దర్శకునిగా పేరుపొందాడు. మూడు ఆస్కార్ అవార్డులను అందుకోవడమే కాకుండా హాలీవుడ్ చరిత్రలో తిరుగులేని దర్శకునిగా నిలిచిపోయాడు.
ఆల్బర్ట్ ఐన్‌స్టీన్
నాలుగు సంవత్సరాల వయసు వచ్చేంతవరకు ఐన్‌స్టీన్‌కు మాటలు రాలేదు. ఏడు సంవత్సరాల వయసు వచ్చేవరకు చదవలేకపోయాడు. ప్రాథమిక స్కూలు స్థాయిలో ఐన్‌స్టీన్‌ను ఒక మానసిక వికలాంగునిగా చూసేవారు. ఉపాధ్యాయులు ఏదైనా అడిగితే తనలో తాను కూడబలుక్కొని ఆ తరువాత బయటకు చెప్పేవాడు. దాంతో ఉపాధ్యాయులు ఈ విద్యార్థి జీవితంలో ఎందుకూ పనికిరాడని అన్నారు. అలాంటి ఐన్‌స్టీన్ భౌతికశాస్త్రంలో అద్భుతమైన ప్రయోగాలు చేశాడు. సాపేక్ష సిద్ధాంతాన్ని కనుగొని నోబెల్ బుహుమతి అందుకున్నాడు.
జీవితంలో ఎత్తుపల్లాలు...
జీవితం ఎత్తుపల్లాలమయం. రాత్రి, పగలు, వేసవి, చలికాలంలా అవి ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి. ఒక అవరోహణ తర్వాత ఒక ఆరోహణ తప్పకుండా ఉంటుంది. ఏదీ శాశ్వతం కాదు. పైకెళ్లాక కూడా ఆ స్థాయిని నిలబెట్టుకునేందుకు చాలా కృషి చేయాల్సి వుంటుంది. ఏమాత్రం ఏమరుపాటుగా వ్యవహరించినా క్షణాల్లో కిందికి పడిపోతారు.
ఎదగడానికి దగ్గరి దారి లేదు. ఏ కష్టమూ అనుభవించకుండా ఒకేసారి పైకి వెళ్లడం అసాధ్యం. అందుకే -" నీకు చేదు గురించి తెలియకపోతే తీపిని ఆస్వాదించలేవు.'' అని చెపుతుంది ఒక పాత సామెత. నిన్ను కష్టాల్లోకి తోసిన ప్రతి సందర్భమూ నీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి వచ్చిన ఒక అవకాశంగా భావించాలి. చాలెంజ్‌లను ఎదుర్కోకుండా పరిణతిని సాధించలేం. ఎంత పెద్ద కష్టాన్ని నువ్వు అధిగమించగలిగితే అంత పటిష్టంగా తయారవుతావు.
విజేతగా నిలవాలంటే - సంక్లిష్టసమస్యల్ని పట్టుదలగా పరిష్కరించుకుంటూ, అదే సమయంలో మరిన్ని చాలెంజ్‌లను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. ఆ సమస్యలు ఒక వేళ నిన్ను కిందికి పడదోసినా నువ్వు దిగులుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సంక్లిష్ట సమస్యల్ని పరిష్కరించిన అనుభవం సంపాదించుకున్నావు కనక.
జీవితంలో గెలిచిన వారు తమ గొప్ప క్షణాలను అపజయాలు పాలైనప్పుడే అనుభూతి చెంది ఉంటారు. సమస్యలను పరిష్కరించుకుంటూ ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు చెప్పలేనంత ఉత్తేజాన్ని పొంది ఉంటారు. నిజానికి పరాజయంలో ఉన్నప్పుడే ఎవరైనా ఎక్కువ విషయాలు తెలుసుకోగలుగుతారు. దీనికి సంబంధించిన ఒక ఉదాహరణ మీముందు ఉంచుతాను.
హ్యారీపోటర్ రచయిత్రి జె.కె.రోలింగ్
పుస్తక వ్యాపారంలో 'హ్యారీపోటర్' సిరీస్ పెను సంచలనం. అది కోటానుకోట్ల వ్యాపారాన్ని సృష్టించింది. అలాంటి 'హ్యారీపోటర్' సృష్టికర్త, రచయిత్రి జె.కె. రోలింగ్ ప్రాథమిక దశలో ఎన్ని కష్టాలు అధిగమించారో తెలుసుకోవడానికి ఇది చదవండి.
ఇంగ్లాడులోని గ్లౌసెస్టర్‌షైర్‌లోని చిప్పింగ్ సాడ్‌బరీలో రోలింగ్ పుట్టారు. పోర్చుగల్‌కు చెందిన ఒక జర్నలిస్టును ఆమె వివాహమాడారు. వారికి 1993లో ఒక పాప పుట్టింది. కూతురు పుట్టిన కొన్నాళ్లకే భర్తతో విడాకులు తీసుకున్న రోలింగ్ పాపతో సహా స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌కు చేరుకున్నారు. అప్పుడే హ్యారీపోటర్ రాయడానికి రోలింగ్ సిద్ధపడ్డారు. ఈ సమయం ఆమె జీవితంలో ఎంతో భయానకమైనది.
హ్యారీపోటర్ నవల రాయడానికే కాదు, దాన్ని పబ్లిష్ చేయడానికీ రోలింగ్ ఎన్నో అవరోధాలు అధిగమించాల్సి వచ్చింది. తన కూతురితో కలిసి రెస్టారెంట్‌లో కూర్చుని రాసేవారు. అక్కడైతే చలిలేకుండా వెచ్చగా ఉంటుందని. నవల పూర్తి చేయడానికి స్కాటిష్ ఆర్ట్స్ కౌన్సిల్ వారి ఆర్థిక సహాయం తీసుకున్నారు. అయినా రోలింగ్ కష్టాలు కొలిక్కి రాలేదు. నవలను కొనడానికి ఏ పబ్లిషింగ్ సంస్థా ముందుకు రాలేదు.
చివరకు ఎన్నో తిరస్కరణల తర్వాత యుకెకు చెందిన బ్లూమ్స్‌బరీ సంస్థ నాలుగువేల డాలర్లకు హ్యారీపోట్టర్ నవలను కొనుగోలు చేసింది. ఎంతో కష్టపడి రాసిన ఈ నవలనుఆమె మారుపేరుతో విడుదల చేయాల్సి వచ్చింది. ఎందుకంటే యువకులు స్త్రీలు రాసిన పుస్తకాలంటే పెద్దగా ఆసక్తి చూపరని బ్లూమ్స్‌బరీ భావించింది. జె.కె రోలింగ్ అసలు పేరు జోన్‌కాథలిన్. దానిని జె.కె.గా ఉంచి జె.కె. రోలింగ్ పేరుతో విడుదల చేశారు.
ఆపై హ్యారీపోటర్ సిరీస్ సృష్టించిన సంచలనం తెలిసిందే. పుస్తకాలు రాయడం ద్వారా బిలియనీర్‌గా మారిన తొలి వ్యక్తి జె.కె. రోలింగ్ అని ఫోర్బ్స్ పేర్కొంది. హార్వర్డ్ అల్యుమిని అసోషియేషన్ నిర్వహించిన వార్షికోత్సవ సభలో జె.కె రోలింగ్ తన విజయాల గురించి మాట్లాడుతూ "ఇదంతా అపజయం నుంచి పొందిన లాభమే'' అన్నారు.
- వన్ బుక్ ఫర్ లైఫ్ సక్సెస్
రచయిత: వేణు.జి. సోమినేని
పేజీలు: 188
ధర: 475
రచయిత: వేణు.జి. సోమినేని
పేజీలు: 188
ధర: 475